OnePlus Nord 5: స్మూత్ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ చిప్సెట్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ నార్డ్ సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్డ్ 5 లాంచ్ డేట్ అనౌన్స్

స్మూత్ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ చిప్సెట్ ఫీచర్స్ తో ఈలాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ ఆటపట్టిస్తోంది

ఈ రెండు ఫోన్స్ లో వన్ ప్లస్ నార్డ్ 5 కీలక ఫీచర్స్ కూడా వన్ ప్లస్ వెల్లడించింది

OnePlus Nord 5: స్మూత్ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ చిప్సెట్ తో లాంచ్ అవుతోంది.!

OnePlus Nord 5: వన్ ప్లస్ నార్డ్ సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్డ్ 5 మరియు నార్డ్ CE5 లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ రెండు ఫోన్స్ లో వన్ ప్లస్ నార్డ్ 5 కీలక ఫీచర్స్ కూడా వన్ ప్లస్ వెల్లడించింది. స్మూత్ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ చిప్సెట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ ఆటపట్టిస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో రాబోతోందో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord 5: లాంచ్ డేట్

వన్ ప్లస్ నార్డ్ 5 మరియు CE5 రెండు స్మార్ట్ ఫోన్ లను కూడా జూలై 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేసినట్టు అనౌన్స్ చేసింది. ఈ రెండు ఫోన్స్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ తో అమెజాన్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. అంటే, ఈ ఫోన్స్ కోసం అమెజాన్ ఇండియా ను ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ప్రకటించింది.

OnePlus Nord 5: కీలక ఫీచర్స్

వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ సింపుల్ అండ్ క్లీన్ డిజైన్ తో లాంచ్ అవుతున్నట్లు టీజర్ ఇమేజస్ ద్వారా అర్థం అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ Ai సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా వన్ ప్లస్ ప్రకటించింది.

OnePlus Nord 5

వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది. ఈ చిప్ సెట్ 15 లక్షలకు పైగా AnTuTu స్కోర్ అందించగలిగే పావుర ఫుల్ చిప్ సెట్. ఇది AI సపోర్ట్ తో మరింత వేగంగా ఉంటుంది గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే సత్తా కలిగి ఉంటుంది.

అలాగే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే గురించి కూడా కంపెనీ వివరాలు వెల్లడించింది. వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్మూత్ డిస్ప్లే ఉందని వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ( BGMI ) మరియు కాల్ ఆఫ్ డ్యూటీ : మొబైల్ (CODM) గేమ్స్ ఈ ఫోన్ చాలా స్మూత్ మరియు నిలకడగా కొనసాగుతాయని వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది.

Also Read: Poco F7 5G: లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ విడుదల చేసిన పోకో.!

వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ త్వరగా వేడెక్కకుండా మంచి కూలింగ్ నిర్వహణ అందించే పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సపోర్ట్ అందించినట్లు కూడా వన్ ప్లస్ వెల్లడించింది. కెమెరా సెటప్ వివరాలు కూడా ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ కూడా వన్ ప్లస్ త్వరలోనే అందించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile