వన్‌ప్లస్ నార్డ్ 2 5G ఫోన్ 90Hz ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తోంది

వన్‌ప్లస్ నార్డ్ 2 5G ఫోన్ 90Hz ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తోంది
HIGHLIGHTS

వన్‌ప్లస్ అప్ కమింగ్ 5G స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 2

వన్‌ప్లస్ నార్డ్ 2 5G లో లేటెస్ట్ మీడియాటెక్ ప్రొసెసర్

ఆక్సిజన్ OS 11 తో వస్తున్నట్లు కూడా ప్రకటించింది

వన్‌ప్లస్ యొక్క అప్ కమింగ్ 5G స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 2 ను జూలై 22 న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, వన్‌ప్లస్ నార్డ్ 2 5G స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను కూడా అధికారికంగా వెల్లడించింది.  ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 9 సిరీస్‌కు సమానమైన డిజైన్‌ను కలిగి ఉంది. అంతేకాదు, వన్‌ప్లస్ నార్డ్ 2 లేటెస్ట్ మీడియాటెక్ ప్రొసెసర్ Dimensity 1200 AI SoC మరియు ఆక్సిజన్ OS 11 తో వస్తున్నట్లు కూడా ప్రకటించింది. అయితే, వన్‌ప్లస్ నార్డ్ 2 యొక్క ఎక్స్ పెక్టెడ్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ గురించి చూద్దాం.

 OnePlus Nord 2: అనౌన్స్డ్ మరియు రూమర్ స్పెక్స్

వన్‌ప్లస్ నార్డ్ 2 యొక్క ఎక్స్ పెక్టెడ్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ హై రిజల్యూషన్ డిస్ప్లే తో రావచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 2  మీడియాటెక్ యొక్క లేటెస్ట్ మరియు ఫాస్ట్ ప్రాసెసర్ Dimensity 1200 AI SoC తో వస్తున్నట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. ఈ ఫోన్ కూడా ఆక్సిజన్ స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో పనిచేస్తుంది.

ఇక కెమెరా సెటప్ గురించి చూస్తే, వన్‌ప్లస్ నార్డ్ 2 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంటుంది. ఈ సెటప్, 50 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ మరియు 2 మెగాపిక్సెల్ వంటి క్లీన్ సెటప్ తో ఉంటుంది మరియు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ తో ఉంటుంది. ఈ ఫోన్ 4,500 mah బ్యాటరీ మరియు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

OnePlus Nord 2: Expected Price

వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ రూ.30,000 రూపాయల కంటే తక్కువ ధరకే ప్రకటించ వచ్చని అంచనా వేస్తున్నారు.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo