OnePlus N6x కొత్త టీజర్ మరియు అప్డేట్ విడుదల: న్యూ లుక్ కన్ఫర్మ్.!

HIGHLIGHTS

OnePlus N6x కొత్త టీజర్ మరియు అప్డేట్ ను ఈరోజు వన్ ప్లస్ విడుదల చేసింది

నిలువు కెమెరా సెటప్ మాదిరి కెమెరా డిజైన్ ఉన్నట్లు అనిపిస్తుంది

ఈ ఫోన్ ను ఆగస్టు మొదటి వారంలో లాంచ్ చేసే అవకాశం ఉంది

OnePlus N6x కొత్త టీజర్ మరియు అప్డేట్ ను ఈరోజు వన్ ప్లస్ విడుదల చేసింది. వన్ ప్లస్ కొత్తగా విడుదల చేసిన ఈ టీజర్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు కొంచెం కనిపిస్తున్నాయి. గత నెల వన్ ప్లస్ ఎన్ సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డౌన్ టౌన్ వెర్షన్ కూడా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇండియన్ మార్కెట్లో ఎక్కువ కాంపిటీషన్ నడిచే బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఇప్పటికే అంచనా వేసి చెబుతున్నాయి.

OnePlus N6x కొత్త టీజర్ ఏమి చెబుతోంది?

వన్ ప్లస్ ఎన్6x స్మార్ట్ ఫోన్ కొత్త టీజర్ లో ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క అస్పష్టమైన ఇమేజ్ కన్పిస్తోంది. అయితే, ఇందులో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా మరియు సైడ్ బటన్స్ కనిపిస్తున్నాయి. ఈ ఇమేజ్ ని చూస్తుంటే, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లో వన్ ప్లస్ నార్డ్ సిరీస్ లో ఉండే నిలువు కెమెరా సెటప్ మాదిరి కెమెరా డిజైన్ ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే, ఈ ఫోన్ కెమెరా బంప్ పక్కనే LED ఫ్లాష్ లైట్ కూడా ఉంది.

ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు. అలాగే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ కలిగి ఉన్నట్లు కూడా టీజర్ ఇమేజ్ ద్వారా చూపించారు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇతర ఫీచర్లు లేదా వివరాలు ఇంకా కంపెనీ వెల్లడించలేదు.

OnePlus N6x లాంచ్ ఎప్పుడు?

వన్ ప్లస్ ఎం 6x స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంచింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను కేవలం కమింగ్ సూన్ ట్యాగ్ లైన్ తో మాత్రమే టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ ను ఆగస్టు మొదటి వారంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Also Read: Dolby Audio vs Dolby Atmos Soundbar: మీకు ఏది బెస్ట్ మరియు మేజర్ తేడాలు ఏమిటి.!

వన్ ప్లస్ ఎన్6x : అంచనా ఫీచర్స్

వన్ ప్లస్ ఎన్6x అంచనా ఫీచర్స్ మాత్రం ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఈ ఫోన్ MediaTek Dimensity సిరీస్ బడ్జెట్ ప్రాసెసర్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ ఉన్న పెద్ద 6.75 ఇంచ్ LCD స్క్రీన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో 8000 mAh బిగ్ బ్యాటరీ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ ఫోన్ టీజర్ డిజైన్ చూస్తుంటే, ఈ ఫోన్ 6000 mAh కంటే పెద్ద బ్యాటరీ కలిగి ఉండే అవకాశం లేదని అనిపిస్తోంది. ఆఫ్ కోర్స్ ఇవన్నీ అంచనా ఫీచర్స్ మాత్రమే అని మరు గమనించాలి.

త్వరలోనే వన్ ప్లస్ ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ కూడా వెల్లడించే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :