OnePlus N6 launched in India and know price and features
OnePlus N6 : వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 8000 mAh భారీ బ్యాటరీతో బడ్జెట్ ధరలో అందించడం విశేషం. ఈ ఫోన్ మంచి స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ లో మంచి ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.
వన్ ప్లస్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. వీటిలో ఈ ఫోన్ బేసిక్ (4GB + 128GB) వేరియంట్ ను రూ. 22,999 ధరతో హై ఎండ్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 24,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ఫ్రెష్ మింట్ మరియు మిడ్ నైట్ గ్రీన్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ ను వన్ ప్లస్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల డైరెక్ట్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు వన్ ప్లస్ వెబ్సైట్ నుంచి లభిస్తుంది.
వన్ ప్లస్ ఈ ఫోన్ ను 6.8 అంగుళాల బిగ్ LCD స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ ను HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వంటి ఫీచర్స్ తో అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ స్మూత్ స్క్రోలింగ్ మరియు మెరుగైన టచ్ అనుభవం ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత Oxygen OS 16 తో వస్తుంది.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6360 Apex ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఇది 6 లక్షలకు పైగా AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్. ఇది గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 4GB / 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ని అందించింది. అంతేకాదు, ఇందులో వర్చువల్ ర్యామ్ ఫీచర్ మరియు micro SD కార్డు ద్వారా 2TB వరకు మెమోరిని విస్తరించే అవకాశం కూడా అందించింది.
Also Read: Prime Day 2026 సేల్ టాప్ 3 స్మార్ట్ ఫోన్ డీల్స్ లిస్ట్ అవుట్ చేసిన అమెజాన్..!
కెమెరా విభాగానికి వస్తే, ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50MP AI మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే, ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద FHD వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఇది AI Eraser మరియు AI Portrait Glow వంటి చాలా లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇక ఈ ఫోన్ మెయిన్ ఫీచర్ విషయానికి వస్తే, వన్ ప్లస్ ఈ ఫోన్ ను 8000mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను 45W SUPER VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బైపాస్ సపోర్ట్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది. సాధారణ వినియోగంలో ఈ ఫోన్ సుమారు 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.