OnePlus N6: భారీ 8000 mAh బ్యాటరీతో బడ్జెట్ ధరలో వచ్చిన ఫోన్ గా నిలుస్తుంది.!
వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ ఎన్ 6 ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ను 8000 mAh భారీ బ్యాటరీతో బడ్జెట్ ధరలో అందించడం విశేషం
ఈ ఫోన్ మంచి స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ లో మంచి ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది
OnePlus N6 : వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 8000 mAh భారీ బ్యాటరీతో బడ్జెట్ ధరలో అందించడం విశేషం. ఈ ఫోన్ మంచి స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ లో మంచి ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyOnePlus N6: ప్రైస్
వన్ ప్లస్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. వీటిలో ఈ ఫోన్ బేసిక్ (4GB + 128GB) వేరియంట్ ను రూ. 22,999 ధరతో హై ఎండ్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 24,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ఫ్రెష్ మింట్ మరియు మిడ్ నైట్ గ్రీన్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది.

ఆఫర్స్ అండ్ సేల్
ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ ను వన్ ప్లస్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల డైరెక్ట్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు వన్ ప్లస్ వెబ్సైట్ నుంచి లభిస్తుంది.
OnePlus N6: పూర్తి స్పెసిఫికేషన్స్
వన్ ప్లస్ ఈ ఫోన్ ను 6.8 అంగుళాల బిగ్ LCD స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ ను HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వంటి ఫీచర్స్ తో అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ స్మూత్ స్క్రోలింగ్ మరియు మెరుగైన టచ్ అనుభవం ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత Oxygen OS 16 తో వస్తుంది.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6360 Apex ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఇది 6 లక్షలకు పైగా AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్. ఇది గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 4GB / 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ని అందించింది. అంతేకాదు, ఇందులో వర్చువల్ ర్యామ్ ఫీచర్ మరియు micro SD కార్డు ద్వారా 2TB వరకు మెమోరిని విస్తరించే అవకాశం కూడా అందించింది.
Also Read: Prime Day 2026 సేల్ టాప్ 3 స్మార్ట్ ఫోన్ డీల్స్ లిస్ట్ అవుట్ చేసిన అమెజాన్..!
కెమెరా విభాగానికి వస్తే, ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50MP AI మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే, ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద FHD వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఇది AI Eraser మరియు AI Portrait Glow వంటి చాలా లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇక ఈ ఫోన్ మెయిన్ ఫీచర్ విషయానికి వస్తే, వన్ ప్లస్ ఈ ఫోన్ ను 8000mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను 45W SUPER VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బైపాస్ సపోర్ట్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది. సాధారణ వినియోగంలో ఈ ఫోన్ సుమారు 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
