వన్‌ప్లస్ 9R మొదటి సేల్!! వన్‌ప్లస్ 9 సిరీస్ బడ్జెట్ వేరియంట్

వన్‌ప్లస్ 9R మొదటి సేల్!! వన్‌ప్లస్ 9 సిరీస్ బడ్జెట్ వేరియంట్
HIGHLIGHTS

వన్‌ప్లస్ 9R మరియు వన్‌ప్లస్ 9 5G సేల్

వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ

లేటెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్, బెస్ట్ కెమెరా ఫీచర్లు

ఇండియాలో వన్‌ప్లస్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 9 సిరీస్ నుండి వన్‌ప్లస్ 9R మరియు వన్‌ప్లస్ 9 5G సేల్ ఈరోజు మొదలవుతుంది.  ఈ వన్‌ప్లస్ 9 సిరీస్ నుండి తక్కువ ధరకు లభించే వేరియంట్ వన్‌ప్లస్ 9R. అయితే, ఈ సిరీస్ నుండి తక్కువ ధరలో వచ్చినా కూడా ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్, బెస్ట్ కెమెరా ఫీచర్లు మరియు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది.         

వన్‌ప్లస్ 9R : ధర

వన్‌ప్లస్ 9R (8జీబీ + 128 జీబీ ) : రూ.39,999

వన్‌ప్లస్ 9R (12జీబీ + 256 జీబీ ) : రూ.43,999

సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. 

వన్‌ప్లస్ 9R : ప్రత్యేకతలు

ఈ వన్‌ప్లస్ 9R స్మార్ట్ ఫోన్ 6.55 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన ఎడమ వైపున పంచ్ హోల్ డిజైన్ ని అందించింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు గొరిల్లా గ్లాస్ 6 రక్షణతో వస్తుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB UFS 3.1 2- లైన్ స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది ఆక్సిజన్ OS ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల పరంగా, వన్‌ప్లస్ 9R వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. అయితే ఈ కెమెరాలు అద్భుతాలను చేయగలవు.   దీనిలో ప్రాధమిక కెమెరాని 48MP SonyIMX586 సెన్సార్ ని OIS మరియు EIS ఫీచర్లతో f/1.7 అపర్చర్ తో అందించింది. అంటే, ఈ మైన్ కెమెరా ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకటించడంలో అద్భుతంగా వుంటుంది. దీనికి జతగా 16MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5MP మాక్రో మరియు 2MP మోనో క్రోమ్ సెన్సార్ లను జతచేసింది.

ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరాని SonyIMX471 సెన్సార్ తో అందించింది. వెనుక కెమెరా CINE యాస్పెక్ట్ రేషియో వీడియో రికార్డింగ్ తో సహా చాలా కెమెరా ఫీచర్లను కలిగి ఉంది.    

వన్‌ప్లస్ 9R ఇన్ డిస్ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్త్తుంది. ఈ ఫోన్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 65W వ్రాప్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ ను  1% నుండి 100% నింపడానికి కేవలం 39 నిముషాల సమయం మాత్రమే తీసుకుంటుందని వన్‌ప్లస్ తెలిపింది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo