వన్‌ప్లస్ 9 సిరీస్ సూపర్ కెమెరాతో లాంచ్ అవుతోంది

వన్‌ప్లస్ 9 సిరీస్ సూపర్ కెమెరాతో లాంచ్ అవుతోంది
HIGHLIGHTS

హసల్ బ్లాడ్ కెమెరా సిస్టంతో వన్ ప్లస్ 9 సిరీస్ లాంచ్

Oneplus 9 Series కెమెరా ఫీచర్లు

వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లను మార్చి 23 న లాంచ్

గత కొన్ని నెలలుగా ఇంటర్నెట్ మరియు స్మార్ట్ ఫోన్ టెక్నలాజి ప్రప్రంచాన్ని ఊపేస్తున్న విషయం హసల్ బ్లాడ్ కెమెరా సిస్టం తో విడుదల కానున్నట్లు వన్ ప్లస్ 9 సిరీస్ లాంచ్. అయితే, ఎట్టకేలకు కంపెనీ ఈ వన్‌ప్లస్ 9 సిరీస్ లాంచ్ గురించి అధికారికంగా ప్రకటించింది. వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లను మార్చి 23 న ప్రకటిచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

వాస్తవానికి, ఈ వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ల గురించి ఇప్పటికే అనేకమైన లీక్స్ మరియు రూమర్లు కూడా వచ్చాయి. ఈ లీక్స్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్లు ఎలా ఉండబోతున్నాయన్న విషయం పైన ఒక అవగాహన కల్పించాయి. వన్‌ప్లస్ 9 ప్రో మరియు వన్‌ప్లస్ 9 లైట్ కెమెరా గురించి లీకైన వివరాలు ఈ ఫోన్ల కెమెరా సెటప్ గురించి పూర్తిగా వివరిస్తున్నాయి.

ఈ లీక్స్ లో తెలిపిన ప్రకారం, వన్‌ప్లస్ 9 ప్రో 48MP మరియు 64MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి జతగా మంచి ఆప్టికల్ జూమ్ అందించగల టెలీఫోటో కెమెరాని కూడా కలిగి వుంటుంది. అయితే,  వన్‌ప్లస్ 9 లైట్ మాత్రం 64MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని కలిగి ఉందవచ్చని, లీక్స్ వివరిస్తున్నాయి. కానీ, ఇవన్నీ కూడా ఆన్లైన్లో వస్తున్నా లీక్స్ మాత్రమే దీని పైన ఎటువంటి అధికారిక ద్రువీకరణ లేదు.

అలాగే, ఈ లీక్స్ నుండి ఈ వన్‌ప్లస్ 9 ప్రో స్నాప్ డ్రాగన్ 888 ప్రొసెసర్, పెద్ద QHD + డిస్ప్లే  మరియు 8GB ర్యామ్ తో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఇందులో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి కూడా ప్రస్తావించ బడింది. ఇక వన్‌ప్లస్ 9 లైట్ విషయానికి వస్తే, ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 690 ప్రొసెసర్,  8GB ర్యామ్ మరియు 5,000mAh బ్యాటరీతో  తీసుకొచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.                                             

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo