ONEPLUS 7T Pro అక్టోబర్ 10 న విడుదల కానుంది

ONEPLUS 7T Pro అక్టోబర్ 10 న విడుదల కానుంది
HIGHLIGHTS

మెక్‌లారెన్ ఎడిషన్‌ను స్పెషల్ ఎడిషన్ మోడల్‌గా విడుదల చేయనుంది.

వన్‌ప్లస్ ఇప్పటికే ఈ సంవత్సరానికి తగినన్ని ఫోన్లను విడుదల చేయగా, ఇప్పుడు ఈ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 7 టి యొక్క తరువాతి తరం ఫోనుగా  వన్‌ప్లస్ 7 టి ప్రో ని లాంచ్ చేయనున్నట్లు టీజ్ చేస్తోంది. కంపెనీ ట్వీట్ ప్రకారం, ఈ ఫోన్ అక్టోబర్ 10 న విడుదలకానున్నట్లు తెలుస్తోంది. అయితే, టీజర్ పూర్తిగా సరైనదని ఖచ్చితంగా చెప్పలేము. కాని, వన్‌ప్లస్ 7 టి ప్రో ఇదే రోజున ఆవిష్కరించబడుతుందని అంచనావేస్తున్నారు.

వన్‌ప్లస్ 7 టి ని, వన్‌ప్లస్ టీవీ సిరీస్‌తో పాటు సెప్టెంబర్ 26 న భారతదేశంలో విడుదల చేశారు. వన్‌ప్లస్ 7 టి ప్రో రెండు వారాల తరువాత లాంచ్ అవుతోంది. వన్‌ప్లస్ 7 ను చిన్నదిగా చేసిందని, ఈ వన్‌ప్లస్ 7 ప్రో విడుదలతో కంపెనీ ఆ తప్పును తప్పిస్తోందని స్పష్టమైంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్మార్ట్‌బై ఆఫర్ పేజీలోని జాబితా ప్రకారం ఈ ఫోన్ అక్టోబర్ 15 నుండి విక్రయించబడుతుందని భావిస్తున్నారు.

వన్‌ప్లస్ 7 టి ప్రో వన్‌ప్లస్ 7 ప్రోతో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ, వన్‌ప్లస్ వన్‌ప్లస్ 7 టి ప్రో మెక్‌లారెన్ ఎడిషన్‌ను స్పెషల్ ఎడిషన్ మోడల్‌గా విడుదల చేయనుంది. అవి రెండూ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ యొక్క శక్తితో రానున్నాయి. ఈ రెండు ఫోన్‌లలో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రావచ్చు. వన్‌ప్లస్ 7 టి ప్రో ఒక 6.67-అంగుళాల QHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌తో రాగలదనిపిస్తోంది. 7 టి ప్రో నిలువు కెమెరా స్టాక్‌తో మరియు ఆండ్రాయిడ్ 10 తో రన్ చేస్తుంది. ఈ ఫోన్ ఒక 4,080 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు వస్తుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo