OnePlus 10 Pro: ఇండియాలో లాంచ్ కి సిద్ధమవుతోంది ..BIS ఆమోదం పొందిన ఫోన్..!
ఇటీవల చైనాలో విడుదలైన OnePlus 10 Pro అతిత్వరలోనే ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఆమోదం పొందింది. అంటే దీని అర్ధం త్వరలోనే ఈ ఫోన్ ఇండియాలో విడుదల అవుతుంది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 gen1 మరియు భారీ కెమెరా సెట్టింగ్ వంటి మరిన్ని ఫీచర్లతో రీసెంట్ గా చైనాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇప్పుడు BIS సర్టిఫికేషన్ పాస్ అయ్యిందంటే, అనుకున్న దానికంటే త్వరగానే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెడుతుంది.
Surveyఈ లేటెస్ట్ అప్డేట్ ను ప్రముఖ టిప్‌స్టర్ అంకిత్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అంకిత్ తన ట్విట్టర్ పోస్ట్ లో BIS వెబ్సైట్ లో కనిపిస్తున్న OnePlus 10 Pro యొక్క స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. ఈ జాబితాలోని మోడల్ NE2211 కాగా, ఇది చైనా వెర్షన్ మోడల్ నంబర్ N2210 కు అనుగుణంగా ఉంది.
OnePlus 10 Pro 5G (NE2211) Appears on BIS Certification
![]()