HIGHLIGHTS
OnePlus 10 Pro లాంచ్ డేట్
OnePlus 10 Pro కోసం ప్రీ అర్ధర్స్ ను కూడా స్వీకరించడం మొదలుపెట్టింది
భారీ ఫీచర్లతో వస్తున్న OnePlus 10 Pro:
వన్ ప్లస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న OnePlus 10 Pro లాంచ్ డేట్ జనవరి 4 న ప్రకటించబడుతుందని OnePlus ధ్రువీకరించింది. అంతేకాదు, చైనాలో ఇప్పటికే OnePlus 10 Pro కోసం ప్రీ అర్ధర్స్ ను కూడా స్వీకరించడం మొదలుపెట్టింది. జనవరి లో OnePlus 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ముందుగా చైనాలో లాంచ్ అవుతాయని, తరువాత మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడతాయని భావిస్తున్నారు.
SurveyOnePlus సంస్థ JD.com ద్వారా OnePlus 10 Pro కోసం ప్రీ-ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభించినట్లు, Weibo వేదికగా ప్రకటించింది. అంతేకాదు, అధికారిక వెబ్‌సైట్‌లోని టైమ్‌లైన్ OnePlus 10 Pro లాంచ్ తేదీని జనవరి 4న వెల్లడిస్తుందని సూచిస్తుంది. ఇది మాత్రమే కాదు, అప్ కమింగ్ వన్ ప్లస్ 10 ప్రో యొక్క కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లను కూడా లీక్ చేసింది.
OnePlus 10 Pro స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇది QHD+ రిజల్యూషన్, అంటే 3216×1440 పిక్సెల్స్ రిజల్యూషన్ ను అందించడమే కాక 120Hz రిఫ్రెష్ రేట్ కు కూడా మద్దతునిస్తుంది.
వన్ ప్లస్ 10 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు చెప్పబడు తోంది. ఇందులో OIS మరియు లేజర్ ఆటోఫోకస్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 48MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 3X Zoom తో కూడిన 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, 32MP సెల్ఫీ కెమెరా ఉంది. OnePlus 10 Pro పెద్ద 5,000mAh బ్యాటరీతో వస్తుంది.