64MP+64MP+64MP భారీ కెమెరాలతో వచ్చిన Nubia Z30 Pro స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

నమ్మశక్యం ఫీచర్లు

మూడు 64MP కెమెరాలు

64MP+64MP+64MP భారీ కెమెరాలతో వచ్చిన Nubia Z30 Pro స్మార్ట్ ఫోన్

హై ఎండ్ స్మార్ట్ ఫోన్లను తయారు చేసే నుబియా తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను మరొకసారి హై ఎండ్ భారీ ఫీచర్లతో ప్రకటించింది. Nubia Z30 Pro స్మార్ట్ ఫోన్ ను చైనాలో ఎవరూ ఊహించని విధంగా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఏకంగా మూడు 64MP కెమెరాలను అందించింది. దీనితో పాటుగా అత్యున్నత వేగాన్ని అందించగల Qualcomm లేటెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ మరియు మరిన్ని భారీ ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nubia Z30 Pro: స్పెక్స్

Nubia Z30 Pro స్పెక్స్ పరంగా, అన్ని విభాగాల్లో భారీగానే ఫీచర్లను కలిగి వుంది. ఈ నుబియా ఫోన్ 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఇందులో, ప్రాసెసర్ కూడా చాలా లేటెస్ట్ మరియు వేగవంతమైనది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇందులో, ర్యామ్ కూడా చాలా శక్తివంతమైనది. ఈ ఫోన్ లో 16GB LPDDR5 RAM మరియు 512GB వరకూ USF 3.1 స్టోరేజ్ అప్షన్ వుంది.

Nubia Z30 Pro కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక క్వాడ్ కెమెరాల సెటప్  వుంది. ఇందులో,  64MP+64MP+64MP+8MP కెమెరాలను ఫిక్స్ చేసింది. వీటిలో, 64MP మైన్ కెమెరా OIS తో వస్తుంది మరియు రెండవ 64MP కెమెరా అల్ట్రా వైడ్ కెమెరా. ఇక మూడవ 64MP కెమరా వివరాలు తెలియవు కానీ నాల్గవ కెమెరా మాత్రం 88MP టెలిఫోటో కెమెరా వుంది. ఇటువంటి భారీ కెమెరా సెటప్  స్మార్ట్ ఫోన్ లో ఇవ్వడం ఇదే మొదలు.                                                                 

బ్యాటరీ మరియు ఛార్జింగ్ టెక్నాలజీ పరంగా కూడా ఈ ఫోన్ టాప్ లో నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో 120W ఛార్జింగ్  సపోర్ట్ కలిగిన 4,200 బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ ను కేవలం 15 నిముషాల్లోనే 100% ఛార్జింగ్ చెయ్యవచ్చని నుబియా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo