నుబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ SD 855+,90Hz రిఫ్రెష్ రేటుతో ఇండియాలో లాంచ్ అయ్యింది.

నుబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ SD 855+,90Hz రిఫ్రెష్ రేటుతో ఇండియాలో లాంచ్ అయ్యింది.
HIGHLIGHTS

ఈ ప్రాసెసర్‌ తో వచ్చిన అత్యంత సరసమైన హ్యాండ్‌సెట్

నుబియా తన సరికొత్త రెడ్ మ్యాజిక్ 3 ఎస్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్‌ ఫోన్ను భారత్‌లో విడుదల చేసింది. ఈ కొత్త డివైజ్ దేశంలో పెరుగుతున్న గేమింగ్ స్మార్ట్‌ ఫోన్ల  జాబితాలోకి వచ్చి చేరుతుంది, ఇందులో ఆసుస్ ROG ఫోన్ II, బ్లాక్‌షార్క్ 2 మరియు ఇతర ఫోన్లు ఉంటాయి. ఈ రెడ్ మ్యాజిక్ 3 ఎస్, కొత్త స్నాప్‌డ్రాగన్ 855+ SoC  శక్తిని కలిగి ఉంది మరియు ఇది భారతీయ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్లో ఈ ప్రాసెసర్‌ తో వచ్చిన అత్యంత సరసమైన హ్యాండ్‌సెట్, ఇది రూ .35,999 నుండి ప్రారంభమవుతుంది. ఆసుస్ ROG ఫోన్ II, వన్‌ప్లస్ 7 T  వంటి ఇతర ఫోన్‌ల ధర రూ .37,999 నుంచి ప్రారంభమవుతాయి.

నుబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ ప్రత్యేకతలు

నుబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ ఒక 6.65 అంగుళాల FHD డిస్ప్లేని ఒక 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు 19.5: 9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC తో నడుస్తుంది మరియు 8GB RAM + 256GB స్టోరేజి మరియు 12GB RAM + 256GB UFS 3.0 స్టోరేజి వెర్షన్లలో వస్తుంది. ఆండ్రాయిడ్ 9 లో నడుస్తున్న ఈ స్మార్ట్‌ ఫోన్ వెనుక భాగంలో అమర్చిన ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది మరియు దీనికి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మద్దతు కూడా ఉంది. ఈ బ్యాటరీ 27W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది మరియు సంస్థ చెప్పిన ప్రకారం, ఇది ఒకే పూర్తి ఛార్జీలో ఆరు గంటల కంటే ఎక్కువ గేమ్‌ ప్లే ని అందించగలదు.

ఆప్టిక్స్ పరంగా, రెడ్ మ్యాజిక్ 3 ఎస్ వెనుక భాగంలో కేవలం సింగల్ 48 MP  సెన్సార్ కలిగి ఉంది, ఇది ఎఫ్ / 1.8 ఎపర్చరు లెన్స్‌తో జతచేయబడుతుంది. ప్రధాన కెమెరా 30fps వద్ద 4K వీడియోలను మరియు 15fps వద్ద 8K వీడియోలను రికార్డ్ చేయగలదు. ముందు భాగంలో 16MP సెన్సార్ ఉంది, ఇది f / 2.0 ఎపర్చరు లెన్స్ కలిగి ఉంటుంది మరియు 30fps వద్ద పూర్తి HD వీడియోలను తీయగలదు.

ఈ గేమింగ్ ఫోన్ యొక్క కొన్ని అదనపు లక్షణాల కోసం, ఇది గేమ్ బూస్ట్ బటన్‌తో వస్తుంది, ఇది మెరుగైన సిస్టమ్ పనితీరును ప్రారంభిస్తుంది. ఈ పరికరంలో ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ మరియు స్పోర్ట్స్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో పాటు, గేమింగ్ చేసేటప్పుడు ఈ ఫోన్ ఉష్ణోగ్రతను తగ్గించడానికి థర్మల్ మోడలింగ్ పద్ధతులు కూడా ఉంటాయి. ఈ ఫోనులో టచ్-సెన్సిటివ్ ట్రిగ్గర్ బటన్లు కూడా ఉన్నాయి, వీటిని కాన్ఫిగర్ చేయవచ్చు మరియు వినియోగదారు అవసరాలకు అనుగుణంగా కస్టమైజేషన్ కూడా చెయ్యవచ్చు . ఈ హ్యాండ్‌ సెట్ కస్టమైజ్ చేయదగిన RGB లైటింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

నుబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ ధర మరియు లభ్యత

నుబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ యొక్క 8 జిబి ర్యామ్ వేరియంట్ మెచా సిల్వర్ కలర్ (స్పేస్ గ్రే) లో వస్తుంది మరియు దీని ధర రూ .35,999. దాని 12 జీబీ ర్యామ్ వెర్షన్ రూ .47,999 ధరతో మరియు సైబర్ షేడ్ (రెడ్ అండ్ బ్లూ) లో లభిస్తుంది. దీపావళి స్పెషల్ సేల్ సందర్భంగా అక్టోబర్ 21 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే, 499 రూపాయలతో  ఈ ఫోన్‌కు పూర్తి మొబైల్ ప్రొటెక్షన్ ఆఫర్ కూడా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo