ఒక రెడ్మి Y3 ఫ్లాష్ సేల్ ఖతం… ఓపెన్ సేల్ షురూ!

HIGHLIGHTS

ఈ రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్ ఒక 32MP సెల్ఫీ కెమెరా మరియు 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా వంటి కెమేరా ప్రత్యేకతలతో ఉంటుంది.

ఒక రెడ్మి Y3 ఫ్లాష్ సేల్ ఖతం… ఓపెన్ సేల్ షురూ!

బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని, షావోమి ఇటీవల సరికొత్తగా తీసుకోచ్చినటువంటి స్మార్ట్ ఫోన్, షావోమి రెడ్మి Y3 జూన్ 4వ తేదీవరకు ఫ్లాష్ సేల్ ద్వారా సేల్ చేయగా, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ను ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడు చేయనుంది. మంచి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ను ఇక ఎప్పుడైనా కొనుగోలు చెయ్యవచు.  ఈ రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్ ఒక 32MP సెల్ఫీ కెమెరా మరియు 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా వంటి కెమేరా ప్రత్యేకతలతో ఉంటుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షావోమి రెడ్మి Y3 ధర మరియు ఆఫర్లు

షావోమి రెడ్మి Y3 –  3GB RAM + 32GB స్టోరేజి ధర – 9,999

షావోమి రెడ్మి Y3 –  4GB RAM + 64GB స్టోరేజి ధర – 11,999

ఈ ఫోనుతో పాటుగా ఎయిర్టెల్ యొక్క భాగస్వామ్యంతో 1120GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో అందించింది.   

షావోమి రెడ్మి Y3  ప్రత్యేకతలు

షావోమి రెడ్మి Y3  స్మార్ట్ ఫోన్,  HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.26 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. అలాగే, ఇందులో అందించిన లో బ్లూ లైట్ టెక్నలాజితో రాత్రి సమయాల్లో కళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తుందని కంపెనీ చెబుతుంది. అధనంగా, ఈ స్క్రీన్ ఒక గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 3GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది ప్రిజం బ్లూ, ప్రైమ్ బ్లాక్ మరియు బోల్డ్ రెడ్ వంటి కలర్ ఎంపికలతో  ఎంచుకునేలా లభిస్తుంది.

ఇక కెమెరా విభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 12MP + 2MP  డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 12MP ప్రధాన కెమరా మరియు 2MP పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 32MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా HDR తో వీడియోలను తీసుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇందులో అందించిన సెల్ఫీల కెమేరాతో మంచి ఫోటోలను క్లిక్ చెయ్యవచు.      

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile