Mi Mix 3 స్మార్ట్ ఫోను 5G నెట్వర్కుతో పనిచేస్తున్నట్లు చూపించిన, షావోమి అధ్యక్షుడు ‘లిన్ బిన్’

HIGHLIGHTS

5G అనేది, ప్రస్తుతం టెలికాం కంపెనీల ముందున్న అతిపెద్ద సవాలు.

Mi Mix 3 స్మార్ట్ ఫోను 5G నెట్వర్కుతో  పనిచేస్తున్నట్లు చూపించిన, షావోమి అధ్యక్షుడు ‘లిన్ బిన్’

షావోమి మి మిక్స్ 3, ఇటీవలే  ప్రారంభించబడింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ పూర్తిగా, ఉత్తేజకరమైన లక్షణాలతో ప్యాక్ చేయబడింది. ఈ స్మార్ట్ఫోన్,  కొన్ని ప్రత్యేకమైన డిజైన్ ఎంపికలతో  తయారుచేయబడింది మరియు  క్వాల్కామ్ యొక్క మొబైల్ వ్యవస్థలో ఉత్తమమైనదిగా ప్యాక్ చేయబడింది. Xiaomi ముందుగానే,  ఫోన్ యొక్క ఒక 5G వేరియంట్ 2019 లో యూరోపియన్ మార్కెట్ కోసం ప్రారంభించనున్నట్లు ధ్రువీకరించారు, మరియు ఇప్పుడు Xiaomi యొక్క ఈ వాగ్దానం నిజమవనున్నట్లు కనిపిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi యొక్క అధ్యక్షుడు అయినటువంటి,  లీ జున్  Weibo ద్వారా ఒక Mi Mix 3 యొక్క కొన్ని ఆసక్తికరమైన విషయాలతో కూడిన ఒక చిత్రాన్ని పంచుకున్నారు. ఎగువ బార్లో, ఎడమవైపున ఉన్న ఒక 'P' చిహ్నంతో పాటు మందమైన 5G చిహ్నాన్ని చూడవచ్చు (ఎగువ కుడి). ఇది కంపెనీ తీసుకురానున్న   5G ఎనేబుల్ మి మిక్స్ 3 గా ఉంటుంది. ఈ 5G ఎనేబుల్ మి మిక్స్ 3 కూడా బాక్స్ నుండి వస్తూనే, ఆండ్రాయిడ్ P తో పనిచేస్తాయని కూడా సూచిస్తుంది. ఫోటో యొక్క కంటెంట్ కాకుండా, మి మిక్స్ 3 గురించిన ఏలాంటి ఇతర వివరాలు లేవు.

 5G -సిద్ధంగా కలిగిన మి మిక్స్3 వేరియంట్, ప్రస్తుతం విదుదల చేసిన అదే అంతర్గత లక్షణాలను కలిగి ఉంటే మంచిది. ఎందుకంటే,  క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగెన్ 845 ఇంకా పూర్తిగా 5G కోసం అనుకూలమైనది కాదు, కనుక ఇది ఫోటోలో చూపించిన మి మిక్స్ 3 యొక్క 5G రెడీ కోసం తరువాతి తరం Qualcomm చిప్సెట్, స్నాప్డ్రాగెన్ 855 నందు నడుస్తుంది అని అంచనావేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo