ఇప్పుడు అతి తక్కువ ధరకే అమ్ముడవుతున్న VIVO Z1 Pro స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది

ఇప్పుడు అతి తక్కువ ధరకే అమ్ముడవుతున్న VIVO Z1 Pro స్మార్ట్ ఫోన్

వివో సంస్థ, ఒక పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా మరియు వెనుక ట్రిపుల్ కెమేరాతో ఇండియాలో  లాంచ్ చేసిన VIVO Z1 PRO స్మార్ట్ ఫోన్ను ఇప్పుడు చాలా తక్కువ ధరకే  మీ సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి, ముందుగా రూ.14,990 రుపాయల ధరలో ఇండియాలో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్ పైన మరొకసారి 1,000 రూపాయల ధర తగ్గించింది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC తో వస్తుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వివో జెడ్ 1 ప్రో : లేటెస్ట్  ధరలు

వివో జెడ్ 1 ప్రో యొక్క 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వెర్షన్ ఇప్పుడు రూ .12,990 ధరతో ఉంది, ఇది ముందుగా ప్రకటించిన రూ .13,990 నుండి తగ్గింపు పొందింది. ఈ ఫోన్ యొక్క 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వెర్షన్ కూడా రూ .1000 తగ్గింపుతో, ఇప్పుడు రూ .13,990 కు లభిస్తుంది. వివో జెడ్ 1 ప్రో మిర్రర్ బ్లాక్, సోనిక్ బ్లూ మరియు సోనిక్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

VIVO Z1 PRO ప్రత్యేకతలు

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది

వివో Z1 ప్రో యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP మూడవ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 16MP సెన్సారు మరియు మరొక 8MP సూపర్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియార్ కెమేరాతో ఉంటుంది. ఈ వివో Z1 ప్రో యొక్క 16MP ప్[ప్రధాన కెమేరా f/1.78 అపర్చరుతో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది. ఇక ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 32MP కెమెరా ఉంటుంది .                         

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile