వివో U10 ఇక ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతోంది

వివో U10 ఇక ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతోంది
HIGHLIGHTS

ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

వివో సంస్థ కేవలం బడ్జెట్ ధరలో వెనుక మూడు కెమేరాలు,  స్నాప్ డ్రాగన్ 665  ప్రాసెసర్ మరియు ఒక పెద్ద 5000 mAh బ్యాటరీతో ఇండియాలో తీసుకొచ్చినటు వంటి వివో U10 ఇప్పటి వరకూ ఫ్లాష్ సేల్ ద్వారా అమ్ముడవుతుండగా, ఈ ఫోన్ ఇప్పుడు Open Sale ద్వారా అమ్ముడవుతోంది.  ఈ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ .8,990 రూపాయల ప్రారంభ ధర వద్ద విడుదలకి చేసింది.

VIVO U10 ప్రత్యేకతలు

ఈ వివో యు 10 ఒక పెద్ద 6.35-అంగుళాల HD + ఐపిఎస్ డిస్‌ప్లేతో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్‌ ని కూడా అందించారు.

కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 13 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

VIVO U10 :  ధర

వివో యు 10 యొక్క సాధారణ వేరియంట్ రూ .8,990 నుండి ప్రారంభమవుతుంది, ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ తో ఉంటుంది. ఇది కాకుండా, రూ .9,990 ధరతో 3 జీబీ + 64 జీబీ వేరియంట్ మరియు 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ను రూ .10,990 రూపాయల ధరతో తీసుకొచ్చారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo