ఇక వివో S1 యొక్క 6GB ర్యామ్ కూడా ఆఫ్ లైన్ లో కొనవచ్చు

ఇక వివో S1 యొక్క 6GB ర్యామ్ కూడా ఆఫ్ లైన్ లో కొనవచ్చు

వివో ఇటీవలే తన వివో S1 స్మార్ట్‌ ఫోన్ను రూ .17,990 ధరతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ధర వద్ద మీకు 4 జీబీ ర్యామ్, 128 జీబీ మోడల్ మొబైల్ లభిస్తుంది. ఈ మోడల్ ఇప్పటికే ఆఫ్‌లైన్ మార్కెట్‌కు కూడా అమ్మకానికి తీసుకురాబడింది. ఇది కాకుండా, మీరు ఫ్లిప్‌కార్ట్ మరియు సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఈ మొబైల్ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. అయితే, ఇప్పుడు 6 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ వేరియంట్  ఫోన్లను కూడా ఆఫ్‌లైన్ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులోకి  తీసుకొచ్చింది . ఈ మొబైల్ ఫోన్ ధర రూ .18,990. ఈ వార్తను మహేష్ టెలికాం ముందుగా ప్రకటించింది.

వివో ఎస్ 1 ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

ఈ వివో ఎస్ 1 మొబైల్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యింది.  ఈ వివో ఎస్ 1  ఫోన్‌ ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్‌ తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఇది ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌ లో, మీడియా టెక్ ఇటీవలే ప్రవేశపెట్టిన మీడియాటెక్ హెలియో పి 65 ప్రాసెసర్ ని అందించింది, ఈ ప్రాసెసర్‌తో లాంచ్ చేసిన మొట్టమొదటి మొబైల్ ఫోన్. అదనంగా, ఇది 4GB/6GB  RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 64GB /128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా ఉంది.

ఇది కాకుండా మీరు ఫోటోగ్రఫీ కోసం వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ పొందుతారు. ఒక 16MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరాను మరియు ఒక  2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్‌లో 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది. ఈ ఫోన్, ఫన్ టచ్ OS స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. ఇది కేవలం 0.48 సెకన్లలో ఫోన్ అన్లాక్ చేయగల ఒక ఇన్- డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది స్కై లైన్ బ్లూ మరియు డైమండ్ బ్లాక్ వంటి రెండు రంగుల ఎంపికలతో

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo