శామ్సంగ్ సరికొత్తగా లాంచ్ చేసిన తన Galaxy A సిరిస్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది
శామ్ సంగ్ ఆన్‌లైన్ స్టోర్ మరియు flipkart ద్వారా లభిస్తాయి.
ఇటీవలే, భారతదేశంలో శామ్సంగ్ గెలాక్సీ A 30 s మరియు గెలాక్సీ A 50 s స్మార్ట్ఫ్ ఫోన్లు ప్రారంభించబడ్డాయి. వీటిలో, శామ్సంగ్ గెలాక్సీ A 30 s , ఒక 720 x 1560 పిక్సెళ్ల రిజల్యూషనుతో 6.4-అంగుళాల ఇన్ఫినిటీ-వి సూపర్ అమోలెడ్ HD + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోనులో ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ ఉంది. అధనంగా, ఇది 14 nm ఎక్సినోస్ 7904 ఆక్టా-కోర్ చిప్ సెట్ తో పాటు 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో పనిచేస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే, గెలాక్సీ A 30 s వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగివుంది – 25 MP ప్రాధమిక సెన్సార్ f / 1.7 లెన్స్, 5 MP డెప్త్ సెన్సార్ మరియు 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. ఇక ముందుభాగంలో 16 MP సెల్ఫీ కెమేరాతో ఉంటుంది.
Surveyముందుగా, రూ .16,999 వద్ద ప్రారంభించిన ఈ శామ్సంగ్ గెలాక్సీ A 30s, ఇప్పుడు రూ .15,999 ధరకు అమ్ముడవుతోంది.
ఇక శామ్సంగ్ గెలాక్సీ A 50 s విషయానికి వస్తే, ఇది 1080 x 2340 పిక్సెల్ రిజల్యూషనుతో ఒక 6.4-అంగుళాల ఇన్ఫినిటీ-U సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఒక 10nm ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9610 ప్రాసెసర్ తో పనిచేస్తుంది, వీటితో పాటు 4GB / 6GB RAM మరియు 128GB స్టోరేజ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ను కలిగి ఉంది. కెమెరా విభాగంలో, ఈ గెలాక్సీ A50s ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది – 48MP ప్రాధమిక కెమెరాతో f / 2.0 లెన్స్‌తో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా మరియు 5MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ ఉంది. శామ్సంగ్ గెలాక్సీ A50s, 15W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 4000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .22,999 ధరతో, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను రూ .24,999 వద్ద ప్రారంభించిన శామ్‌సంగ్ గెలాక్సీ A 50 s, ఇప్పుడు వరుసగా రూ .19,999 మరియు రూ .21,999 ధరలతో అమ్ముడవుతున్నాయి.
Note : రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఆన్ లైన్ లో శామ్ సంగ్ ఆన్‌లైన్ స్టోర్ మరియు flipkart ద్వారా లభిస్తాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
