కేవలం రూ.9,999 ధరకే, రెడ్మి 48MP+5MP డ్యూయల్ కెమేరా ఫోన్.
ఒక 48MP కెమేరాతో అతితక్కువ ధరలో లభిస్తున్న ఫోనుగా దీని గురించిన చెప్పొచ్చు.
ఇండియాలో, ఒక 48MP కెమేరామరియు ఇంకామరెన్నో ప్రత్యేకతలతో షావోమి విడుదల చేసినటువంటి REDMI NOTE 7S స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ముందుగా, కేవలం రూ. 10,999 ధరలో గొప్ప కెమేరా ఫీచర్లతో ఇండియాలో విడుదలైనటువంటి ఈ REDMI NOTE 7S స్మార్ట్ ఫోన్ పైన మొదటి సరిగా 1,000 ధర తగ్గించి కేవలం రూ. 9,999 ధరతో అమ్ముడు చేస్తోంది. ప్రస్తుత ధరను పరిశీలిస్తే, ఒక 48MP కెమేరాతో అతితక్కువ ధరలో లభిస్తున్న ఫోనుగా దీని గురించిన చెప్పొచ్చు. అధనంగా, SBI బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో ఈ ఫోన్ను కొనుగోలు చేసేవారికి 5% డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
Surveyషావోమి రెడ్మి నోట్ 7S : అఫర్ ధరలు
1. షావోమి రెడ్మి నోట్ 7S – 3GB RAM + 32GB స్టోరేజి ధర – 9,999
2. షావోమి రెడ్మి నోట్ 7S – 4GB RAM + 64GB స్టోరేజి ధర – 11,999
షావోమి రెడ్మి నోట్ 7S : ప్రత్యేకతలు
షావోమి రెడ్మి నోట్ 7S స్మార్ట్ ఫోన్, FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. ఈ ఫోన్ ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో దీని స్క్రీన్ ప్రొటెక్ట్ చెయ్యబడింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 3GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 256GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది సఫైర్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్ మరియు రూబీ రెడ్ వంటి కలర్ ఎంపికలతో ఎంచుకునేలా లభిస్తుంది.
ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 48MP + 5MP డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమరా SAMSUNG GM1 సెన్సారుతో వస్తుంది మరియు 5MP కెమేరా పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం ఒక 13MP AI కెమెరాని అందించారు. ఇందులో పోర్ట్రైట్, బొకేహ్ వంటి మరెన్నో ఎంపికలతో సెల్ఫీలను క్లిక్ చెయ్యొచ్చు. అధనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక Pi2 టెక్నలాజితో వస్తుంది కాబట్టి, నీటి తుంపరలు మరియు హ్యుమిడిటీ నుండి రక్షణనిస్తుంది.