Realme X2 ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతోంది

Realme X2 ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతోంది
HIGHLIGHTS

ఓపెన్ సేల్ ద్వారా కొనడానికి అందుబాటులో ఉంటుంది.

గేమింగ్ మరియు గొప్ప కెమేరా ఫీచరాలతో, రియల్మీ ఇండియాలో కేవలం మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసినటువంటి Realme X2 ఇక నుండి ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతోంది. Flipkart మరియు realme.com నుండి ఇది ఓపెన్ సేల్ ద్వారా కొనడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ ఫోనుతో బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తోంది.

Realme X2 ధరలు

1. Realme X2  (4GB + 64GB) ధర – Rs.16,999

2. Realme X2 (6GB + 128GB) ధర – Rs.18,999

3. Realme X2 (8GB + 128GB) ధర – Rs.19,999

Realme X2 : ప్రత్యేకతలు

Realme X2 స్మార్ట్ ఫోన్ ఒక మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది గరిష్టంగా 2.2 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC యొక్క శక్తిని కలిగి ఉంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెసర్ కాబట్టి, స్మార్ట్ ఫోన్ చాలా వేగంగా మరియు స్మూత్ గా పనిచేస్తుంది. ఇక స్క్రీన్ విషయానికి వస్తే, ఒక 6.4-అంగుళాల Full HD + Super AMOLED డిస్ప్లేని 91.9 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ నోచ్ డిజైన్ ఉంది, ఇందులో  సెల్ఫీ కెమెరా ఉంచబడుతుంది మరియు వేగవంతమైన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో అవస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక ప్రత్యేకమైన 3D గ్లాస్ డిజైన్ కలిగి ఉంది, ఇది పెరల్ గ్రీన్, పెరల్ బ్లూ మరియు పెరల్ వైట్ కలర్ ఎంపికలతో వస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, రియల్మి X2  వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. దీనికి జతగా 64MP ప్రాధమిక సెన్సార్‌ తో పాటు, F / 2.4 లెన్స్‌తో 2MP పోర్ట్రెయిట్ లెన్స్ మరియు f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్, మెరుగైన Low -Light చిత్రాలను కూడా అందిస్తుంది. ముందు భాగంలో 32MP సెన్సార్, ఒక f / 2.0 ఎపర్చర్‌తో ఉంటుంది.

రియల్మీ X2 గరిష్టంగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ లో హైపర్‌బూస్ట్ 2.0 అమర్చారు, ఇది గేమింగ్ ఆడేటప్పుడు మరింత మధురానుభూతిని అందిస్తుంది. అలాగే, ఒక 4000mAh బ్యాటరీతో మద్దతు ఉన్నఈ హ్యాండ్‌సెట్ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు 30 వాట్స్  VOOC 4.0 ఛార్జింగ్‌ కు మద్దతు ఇస్తుంది. ఈ VOOC ఛార్జింగ్ 70 నిమిషాల్లో హ్యాండ్‌సెట్ బ్యాటరీని 100 శాతం నింపుతుంది.                      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo