Realme 3 Pro పైన భారీ డిస్కౌంట్

Updated on 10-Jul-2019
HIGHLIGHTS

రియల్మీ 3 ప్రో స్మార్ట్ ఫోను యొక్క 6GB ర్యామ్ వేరియంట్ల పైన 1,000 ధరను తగ్గించింది.

రియల్మీ సంస్థ, ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న పోటీకి అనుగుణంగా తన స్మార్ట్ ఫోన్ ధరలలో గొప్ప మార్పులు చేసింది. ముఖ్యంగా, గొప్ప ప్రత్యేకతలతో తీసుకొచ్చిన రియల్మీ 3 ప్రో స్మార్ట్ ఫోను యొక్క 6GB ర్యామ్ వేరియంట్ల పైన 1,000 ధరను తగ్గించింది. అలాగే, 4GB ర్యామ్ వేరియంట్ పైన కూడా 500 రూపాయల ధరను తగ్గించింది.        

 Realme 3 Pro స్మార్ట్ ఫోన్, కెమేరా మరియు ప్రాసెసర్ పరంగా గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు.  ఇందులో అందించిన  16MP + 5MP డ్యూయల్ రియర్ కెమేరా ఒక 8 షాట్లను కలిపి ఒక 64MP అల్ట్రా HD ఫోటోగా అందించే ఫీచరుతో వస్తుంది. అంతేకాకుండా, ఇందులోని క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరు మరియు 4GB, 6GB ర్యామ్లతో జతగా వస్తుంది కాబట్టి, ఈ ఫోన్ వేగంగా పనిచేస్తుంది.  అలాగే, ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519  సెన్సారుతో వస్తుంది.  ఇందులో వేగవంతమైన ఛార్జింగ్ కోసం VooC 3.0 ఛార్జింగ్ సాంకేతికతను అందిచారు, ఇది అత్యంత వేగవంతంగా ఈ ఫోన్ను ఛార్జ్ చేస్తుంది.      

రియల్మీ 3 ప్రో – ప్రస్తుత ధరలు

REALME 3 PRO (4GB ర్యామ్ + 64GB స్టోరేజి) – Rs. 13,499

REALME 3 PRO (6GB ర్యామ్ + 64GB స్టోరేజి) – Rs. 14,999

REALME 3 PRO (6GB ర్యామ్ + 128GB స్టోరేజి) – Rs. 15,999

REALME 3 PRO ప్రత్యేకతలు

రియల్మీ 3 ప్రో  స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8%  స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు వెనుక ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.  అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్  2.2GHz వేగంతో క్లాక్ చేయబడిన, ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది.ఇది  64GB మరియు 128GB స్టోరేజితో వస్తుంది. అలాగే డ్యూయల్ SIM కార్డులతో పాటుగా ఒక SD మెమొరీ కార్డును కూడా ఒకేసారి వాడుకునేలా ట్రిపుల్ SIM స్లాట్ ఇందులో అందించారు.             

కెమేరాల విషయానికి వస్తే, వెనుక f /1.7 అపర్చరు కలిగిన 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519  సెన్సారుతో వస్తుంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందుభాగంలో ఒక 25MP AI సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.  ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా కలర్ OS 6 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4045mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది బాక్స్ నుండి 20వాట్స్ వేగవంతమైన చార్జరుతో వస్తుంది. ఇందులో వేగవంతమైన ఛార్జింగ్ కోసం VooC 3.0 ఛార్జింగ్ సాంకేతికతను అందిచారు, దీనితో అత్యంత వేగవంతంగా ఛార్జ్ చెయ్యవచ్చని సంస్థ చెబుతోంది.

ఇక ఇందులో అందించిన ప్రత్యేకమైన ఫీచరుగా 960fps స్లో మోషన్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటి వాటిని గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో అందించిన కెమెరాతో 64MP రిజల్యూషన్ అందించగల అల్ట్రా HDR ఫోటోలను తీసుకోవచ్చని రియల్మీ ప్రకటించింది.అలాగే, లైటనింగ్ పర్పల్ , నైట్రో బ్లూ మరియు కార్బన్ గ్రే వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది.  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :