ఇప్పుడు REALME 3 స్మార్ట్ ఫోన్ మరింత తక్కువ ధరకే దొరుకుతుంది
అధనంగా, ముందస్తుగా డబ్బు చెల్లించేవారికి 10% ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
రియల్మీ3 స్మార్ట్ ఫోన్, మార్కెట్లో నడుస్తున్న అన్ని ట్రెండీ ఫీచర్లతో వస్తుంది మరియు 2.1GHz వేగం వరకు క్లాక్ స్పీడ్ అందించగల 12nm మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసరుతో మంచి వేగంవంతమైన అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం flipkart ప్రకటించిన మొబైల్స్ బొనాంజా సేల్ నుండి ఈ ఫోన్ చాల తక్కువ ధరకు దొరుకుతుంది. ఈ స్మార్ట్ ఫోన్, ముందుగా రూ.8,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదలయ్యింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7,999 రూపాయల ధరతో లబిస్తోంది. అధనంగా, ముందస్తుగా డబ్బు చెల్లించేవారికి 10% ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Surveyరియల్ 3 : లేటెస్ట్ ధరలు
రియల్మి 3 యొక్క 3GB RAM / 32GB స్టోరేజ్ ప్రస్తుతం flipkart నుండి రూ .7,999, ధరతో మరియు 4GB RAM, 64GB స్టోరేజీ వేరియంట్ రూ .9,999 ధరతో ప్రకటించబడ్డాయి. ఈ డివైజ్, డైనమిక్ బ్లాక్ మరియు రేడియంట్ బ్లూ కలర్ మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. అధనంగా, HDFC బ్యాంక్ డెబిట్ కార్డు వినియోగదారులకు 10% తగ్గింపు దొరుకుతుంది.
Realme 3 ప్రత్యేకతలు
ఈ రియల్ 3 యొక్క ప్యానెల్ కోసం రియల్ ఒక గ్రేడియంట్ కలర్ డిజైన్ ని అందించింది. ఇది ఒక 19: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియాతో మరియు ఒక పొడుగు నోచ్ రూపకల్పనతో గల ఒక 6.3-అంగుళాల HD + స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 2.1GHz వేగం వరకు క్లాక్ చేయగల 12nm మీడియా టెక్ హీలియో P70 SoC పై నడుస్తుంది. ఈ AI ఈ రోజుల్లో చాల సంచలనాత్మకమైనది, ఈ హ్యాండ్సెట్, ఆప్ నిర్వహణ, సీన్ గుర్తింపులో, తక్కువ కాంతిలో ఫోటోలను తీయడంలో మరియు AI అందాలను ఎనేబుల్ చేస్తుంది. ఒక 13.3 గంటల నిరంతర వీడియో ప్లేబ్యాక్ను ఈ ఫోన్ అందించగలదని ఈ కంపెనీ వాదనలు. రియల్మీ, ఈ ఫోనుతో కంటెంట్ అడాప్టివ్ బ్రైట్నెస్ కంట్రోల్ (CABC) లక్షణాన్ని అనుసంధానించింది, ఇది బ్యాటరీ ఆప్టిమైజేషన్లో 10 శాతం వరకు అందిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, రియల్మ్ 3 స్మార్ట్ ఫోన్ వెనుక 13MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్పుతో వస్తుంది. ఈ 13MP ప్రధాన కెమెరా 5P లెన్స్ మరియు ఒక f / 1.8 ఎపర్చరుతో 1.12μm పిక్సెల్ పిచ్ కలిగి ఉంది. ఇక ఈ 2MP సెకండరీ సెన్సార్ 1.75μm మరియు f / 2.4 ఎపర్చరు లెన్స్ యొక్క పిక్సెల్ పిచ్ కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క కెమెరా హైబ్రిడ్ HDR మద్దతుతో పాటు PDAF మరియు బోకె చిత్రాలకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ సంస్థ, దాని కెమెరా ఆప్ లో ఒక క్రోమా బూస్ట్ మోడ్ను జోడించడంతో ఇది చిత్రం యొక్క డైనమిక్ పరిధిని మరియు రంగులను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. మంచి తక్కువ-కాంతి చిత్రాలను ఎనేబుల్ చెయ్యడానికి నైట్స్కేప్ మోడ్ కూడా ఉంది, కానీ మా రివ్యూ లో ఈ కంపెనీ వాదనలు ఖచ్చితమేనా, లేక కదా అని పరీక్షించబడతాయి.
ఇక ముందు ,ఈ స్మార్ట్ఫోన్ ఒక 13MP సెన్సార్ కలిగి 1.12μm పిక్సెల్ పిచ్ మరియు f / 2.0 ఎపర్చరు లెన్స్ తో ఉంటుంది. ఈ కెమెరా కస్టమైజేషన్ కోసం కెమెరా 2 API కి యాక్సెసిబిలిటీని ఈ హ్యాండ్సెట్ మద్దతు ఇస్తుంది. ఇది Android 9 Pie పైన ఆధారపడి ఒక కొత్త ColorOS 6 UI పై నడుస్తుంది. కొత్త UI 'బోర్డర్లెస్ డిజైన్' ను కలిగి ఉంటుంది మరియు ఒక ఆప్ డ్రాయర్ను పరిచయం చేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
