చౌక ధరలకు నాలుగు కెమేరా ఫోన్లను తీసుకొచ్చిన OPPO

చౌక ధరలకు నాలుగు కెమేరా ఫోన్లను తీసుకొచ్చిన OPPO
HIGHLIGHTS

ఒప్పో తన OPPO A 9 2020 మరియు A 5 2020 స్మార్ట్‌ ఫోన్లను భారతదేశంలో విడుదల చేసింది.

ఒప్పో తన OPPO A 9 2020 మరియు A 5 2020 స్మార్ట్‌ ఫోన్లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లను ఈ నెల చివరి నుండి అమెజాన్ ఇండియా మరియు ఇతర రిటైలర్లలో విక్రయించనుంది. ఒప్పో A 9 2020 మరియు ఒప్పో A 5 2020 రెండింటిలో కూడా ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్, క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయి.

ఒప్పో A9 2020 మరియు A5 2020 లక్షణాలు

ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లుఒక 6.50 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్నాయి. ఇవి డిస్ప్లే పైన ఒక వాటర్‌ డ్రాప్ నోచ్ తో వస్తాయి మరియు గొరిల్లా గ్లాస్ 3+ తో ఈ డిస్ప్లే రక్షించబడింది. ఇక కనెక్టివిటీ కోసం, ఈ  ఫోన్లు డ్యూయల్ సిమ్ (నానో-సిమ్‌తో) కనెక్టివిటీతో వస్తాయి మరియు ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా ColorOS 6.0.1 తో పనిచేస్తాయి. ఈ స్మార్ట్‌ ఫోన్లు ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి మరియు ఒక పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తాయి.

కెమెరా విభానికి వస్తే, వెనుక భాగంలో, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఈ ఒప్పో A 9 2020 మరియు ఒప్పో A 5 2020 లలో ఇవ్వబడింది. అయితే, 48 MP  ప్రైమరీ కెమెరాని OPPO A 9 2020 లో ఇవ్వగా, 12 MP ప్రైమరీ షూటర్ ఒప్పో A 5 2020 లో లభిస్తుంది. అలాగే, ప్రాథమిక కెమెరా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో  జత చేయబడింది. ఇక సెల్ఫీ కోసం, 16MP కెమేరా A9 2020 ఫోనులో మరియు 8MP కెమెరా A5 2020 ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం ఉంచబడింది.

ఒప్పో A9 2020 స్మార్ట్ ఫోన్, 8GB RAM మరియు 128GB స్టోరేజిను అందిస్తుంది మరియు ఈ ఫోను లో ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. ఇక ఒప్పో A5 2020 గురించి మాట్లాడితే, ఇది 4GB  ర్యామ్ మరియు 64GB  స్టోరేజ్ తో వచ్చింది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 256 GB కి పెంచవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లలో వెనుక వేలిముద్ర సెన్సార్ కూడా ఇవ్వబడింది.

ఒప్పో A9 2020 మరియు A5 2020 : ధరలు

ఒప్పో A 9 2020 యొక్క 4 జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ .16,990 కాగా, 8 జిబి ర్యామ్ వేరియంట్ ధర 19,990 రూపాయలు. ఈ ఫోన్ మెరైన్ గ్రీన్ మరియు స్పేస్ పర్పుల్ వంటి రెండు రంగులలో లభిస్తుంది. మరోవైపు, ఒప్పో A5 2020 ఫోన్, రూ .13,990 ధర వద్ద లభిస్తుంది మరియు దీనిని డాజిల్లింగ్ వైట్ మరియు మిర్రర్ బ్లాక్ ఆప్షన్లలో విడుదల చేశారు.

ఈ రెండు స్మార్ట్‌ ఫోన్‌లను అమెజాన్.ఇన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా విక్రయిస్తారు. ఒప్పో A 9 2020 మొదటి సేల్,  సెప్టెంబర్ 16 న అమెజాన్‌ ద్వారా    ప్రారంభమవుతుంది మరియు సెప్టెంబర్ 19 న ఆఫ్‌లైన్ అమ్మకాలకు వెళ్తుంది. ఒప్పో A 5 2020 సేల్, సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది.

ఒప్పో A9 2020 మరియు A5 2020 : లాంచ్ ఆఫర్లు

ఒప్పో అనేక లాంచ్ ఆఫర్లను ప్రకటించింది మరియు ఈ ఫోన్ యొక్క ఆన్‌లైన్ కొనుగోళ్లతో HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించడంపై 5% శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు, అదనంగా, నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందించింది.

ఇవే కాకుండా, రిలయన్స్ జియో చందాదారులకు రూ .79 ప్లాన్‌పై రూ .7,050, 3.1 టిబి 4 జి డేటా వరకు లాభం లభిస్తుంది. ఎయిర్‌టెల్ చందాదారులు డబుల్ డేటా మరియు అపరిమిత కాలింగ్ ద్వారా 249 రూపాయల రీఛార్జితో ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇవే కాకుండా, వోడాఫోన్ ఐడియా యూజర్లు రూ .2,550 క్యాష్‌బ్యాక్, అదనంగా 250 జీబీ డేటాను రూ .255 రీఛార్జిపై అందుకుంటారు. ఈ ఆఫర్‌లు ఆఫ్‌లైన్ వినియోగదారులకు మాత్రమే పరిమితం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo