గీక్ బెంచ్ లో దర్శన్ మిచ్చిన Oneplus 7 T : 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది

గీక్ బెంచ్ లో దర్శన్ మిచ్చిన Oneplus 7 T : 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది
HIGHLIGHTS

క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ తో తీసుకురానున్నట్లు చెబుతున్నారు.

వన్‌ప్లస్ తన Oneplus 7 T, Oneplus 7 T Pro స్మార్ట్‌ ఫోన్‌ లను సెప్టెంబర్ 26 న విడుదల చేయనుంది. గత కొన్ని నివేదికలలో,ఈ  రెండు స్మార్ట్‌ఫోన్‌ల గురించి చాలా సమాచారం వెల్లడైంది మరియు ఈ రెండు ఫోన్లను కూడా లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయినటువంటి, క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ తో తీసుకురానున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ వన్‌ప్లస్ 7 టి మొబైల్ ఫోన్ గీక్‌బెంచ్ జాబితాలో కనిపించింది.

ఈ ఫోన్ యొక్క జాబితాను చైనీస్ టిప్‌స్టర్ భాగస్వామ్యం చేశారు, అయితే EXSS8865 HD1900 మోడల్ నంబర్ మాత్రమే అందులో ఉంచబడింది. గిజ్మోచైనా యొక్క నివేదిక ప్రకారం, ఈ గీక్బెంచ్ జాబితా వన్ ప్లస్ 7 టి యొక్క చైనీస్ ఎడిషన్.

ఇది క్వాల్కమ్ SoC యొక్క బేస్ ఫ్రీక్వెన్సీని 1.78 GHz వద్ద చూపిస్తుంది, ఇది వాస్తవానికి క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 855+ మొబైల్ ప్లాట్‌ఫాం. ఈ స్మార్ట్‌ ఫోన్ను 8 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 10 OS తో తీసుకురానున్నారు. గీక్‌బెంచ్ స్కోర్‌ గురించి మాట్లాడితే, ఈ చైనీస్ వన్‌ప్లస్ 7 టి సింగిల్ కోర్ టెస్ట్ లో 3983, మల్టీ-కోర్ టెస్ట్ లో 10,967 స్కోర్లు సాధించింది.

ఈ ఏడాది ఈ డివైస్ యొక్క 6 జిబి ర్యామ్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేయనున్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 8 GB ర్యామ్‌తో రెండు ఫోన్‌లను తీసుకురానున్నారు. ఇక డిస్ప్లే గురించి చూస్తే, ఈ వన్‌ప్లస్ 7T లో ఒక 6.55-అంగుళాల QHD + సూపర్ అమోలెడ్ డిస్ప్లే అత్యధికంగా 90 Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది.

ఇతర రూమర్ల ను కూడా పరిశీలిస్తే,  ఈ స్మార్ట్‌ ఫోన్‌కు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుందని, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా కూడా ఇవ్వబడుతుంది. ఈ కెమెరా సెటప్‌లో, ఒక ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్, రెండవ కెమెరా 16 మెగాపిక్సెల్స్ మరియు మూడవ కెమెరా 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది.

ఇమేజి సోర్స్ : ఆన్ లీక్స్@ ప్రైస్ బాబా  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo