నోకియా 8.1 పైన Rs. 8,000 రుపాయల భారీ డిస్కౌంట్

Updated on 03-Jun-2019
HIGHLIGHTS

ఈ నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ 1080x 2284 పిక్సెళ్ల రిజల్యూషన్ అందించగల ఒక 6.18 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగి ఉంటుంది.

నోకియా స్మార్ట్ ఫోన్ అంటే క్వాలిటీ మరియు కెమెరాలకు పెట్టింది పేరుగా చెప్పొచ్చు. అంతేకాదు, చాలా మంది కొనుగోలుదారులు కూడా దీన్ని ఒక స్టాండర్డ్ బ్రాండ్ కింద చూస్తారు.  అటువంటి నోకియా ఇటీవల  గొప్ప స్పెక్స్ మరియు కెమేరాలతో ఇండియాలో తీసుకొచ్చినటువంటి, నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు Rs . 8,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. అమేజాన్ ఇండియా లో ప్రస్తుతం కేవలం రూ. 21,400 ధరతో  ఈ స్మార్ట్ ఫోన్ను అమ్ముడు చేస్తోంది. వాస్తవానికి, ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ Rs. 29,999 MRP ధరతో సేల్ చేయబడింది. ఇప్పుడు, ఈ స్మార్ట్ ఫోను పైన 8,599 రూపాయల డిస్కౌంట్ అందుకోవచ్చన్నమాట.   

Nokia 8.1 – Rs.21,880

నోకియా 8.1 ప్రత్యేకతలు

ఈ నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ 1080x 2284 పిక్సెళ్ల రిజల్యూషన్ అందించగల ఒక 6.18 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తన డిస్ప్లే యొక్క పై భాగంలో ఒక సెల్ఫీ కెమేరా మరియు స్పీకర్ ఇముడ్చుకున్న ఒక సంప్రదాయ నోచ్ ను కలిగివుంది. ఇక పనితీరు విషయానికివస్తే, ఈ నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్  కి జతగా,  ఒక 4GB ర్యామ్ మరియు 64 GB అంతర్గత మెమొరీతో వస్తుంది మరియు దీని  స్టోరేజిని మైక్రో SD కార్డుతో 400GB వరకు విస్తరించుకోవచ్చు .

ఇక కెమేరాల విభాగానికివస్తే, నోకియా 8.1 ఒక ZEISS ఆప్టిక్స్ కలిగినటువంటి ఒక ప్రధాన 12MP కెమేరాకు జతగా మరొక 13 MP కెమేరాని కలిగినటువంటి డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 20 MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బాక్స్ నుండి బయటకువస్తూనే సరికొత్త Android 9.1 Pie తో నడుస్తుంది. ముందుగా, ఇండియాలో రూ. 28,831 ధరతో అమ్మకాలను జరిపిన ఈ స్మార్ట్ ఫోన్, ఇప్పుడు కేవలం రూ. 21,880 ధరతో అమేజాన్ నుండి అమ్ముడవుతుంది.  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :