NOKIA 2.2 స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్
ఒక మీడియా టెక్ హీలియో A22 SoC తో వస్తుంది.
HMD గ్లోబల్, భారతీయ మార్కెట్లో చాలా తక్కువధరలో కొత్తగా తీసుకొచ్చిన Android One ఫోనుగా నోకియా 2.2 స్మార్ట్ ఫోన్ గురించి చెప్పొచ్చు. ఇది Android అప్డేట్ లను వేగవంతముగా అందుకోగలదు మరియు ఈ విభాగంలో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ అని కూడా పేర్కొనవచ్చు. ముందుగా, దీన్ని రూ .6,999 ప్రారంభ ధరతో అమ్ముడు చెయ్యగా, ఇప్పుడు దీని పైన 1,000 రూపాయల వరకు ధరను తగ్గించింది. ప్రస్తుతం, రూ .6,999 ధరతో Nokia యొక్క అధికారిక వెబ్సైట్ నుండి అమ్ముడవుతుండగా, అమేజాన్ ఇండియా నుండి కేవలం రూ. 5335 రూపాయలకు అమ్ముడవుతోంది.
Surveyఈ నోకియా 2.2 ఆండ్రాయిడ్ 9 ఫై యొక్క సాధారణ వెర్షన్ను కలిగి ఉంది, స్టాక్ Android తో . Android One లో భాగంగా, పరికరం తదుపరి రాబోయే రెండు సంవత్సరాల పాటు Android Q అలాగే భద్రతా అప్డేట్లుతో సహా, తదుపరి రెండు సంవత్సరాలు వెర్షన్ అప్డేట్ను స్వీకరిస్తుంది.
వాస్తవానికి, ఇదే ధర సెగ్మెంట్లో అందుబాటులో ఉన్న ఇతర బడ్జెట్ ఫోన్ల నుండి ఈ నోకియా 2.2 ను వేరుచేసే అంశాలు చాలానే ఉన్నాయి. మిగిలిన ఎంట్రీ-లెవల్ ఫోన్లన్నీ కూడా తక్కువ రకం హార్డ్వేర్ను కలిగి ఉంటాయి. అయితే, ఇందులో మాత్రం అనేకమైన ప్రత్యేకతలు దీన్ని వేరుచేస్తాయి. ఉదాహరణకు, ఫోన్ ఓపెన్ చేసి మార్చుకోగల పాలికార్బోనేట్ షెల్లో ఉంచబడింది. వేరొక రంగులో మార్చుకోవడానికి వెనుక ప్యానెల్ తీసివేయవచ్చు. ఈ గత సంవత్సరం నోకియా 1 కోసం అందుబాటులో ఉండే ఎక్స్ప్రెస్-ఆన్ కవర్లు లాగనన్నమాట. ఈ సమయంలో, ఎక్స్ప్రెస్-ఆన్ కవర్లు మూడు కొత్త రంగులలో వస్తాయి – ఫారెస్ట్ గ్రీన్, పింక్ శాండ్ మరియు ఐస్ బ్లూ. అలాకాదనుకుంటే , పరికరం కూడా రెండు వేర్వేరు రంగులలో లభిస్తుంది – స్టీల్ మరియు టంగ్స్థన్ బ్లాక్. పక్క వైపులా అంకితమైన Google అసిస్టెంట్ బటన్ కూడా ఉంది.
ఇది 2GB మరియు 3GB RAM ఎంపికలు మరియు 16GB మరియు 32GB స్టోరేజి ఎంపికలతో కలిపి ఒక మీడియా టెక్ హీలియో A22 SoC తో వస్తుంది. అదనంగా, తొలగించదగిన ఒక 3,000 mAh బ్యాటరీతో పాటు ఉంటుంది. ముందు, ఒక పెద్ద 5.71 అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది, దీనిలో 400 నిట బ్రైట్నెస్ వరకూ ఉంటుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో ప్రవేశపెట్టారు, ఇది ముందు కెమెరాని కలిగి ఉంది, డిస్ప్లే అంచుల వరకు విస్తరించింది. అయితే MediaTek Helio A22 నిజంగా ఆ ధర పరిధిలో వేగమైన చిప్సెట్ మాత్రం కాదు. ఇది నాలుగు కోర్టెక్స్- A55 కోర్లతో 2GHz వద్ద క్లాక్ చేయబడిన ఒక క్వాడ్-కోర్ SoC తో ఉంది.
కెమెరా విభాగంలో, నోకియా 2.2 ఒక f / 2.2 ఎపర్చరు మరియు ఒక 1/3 "సెన్సార్ తో వెనుక ఒక 13MP కెమెరాతో వస్తుంది. ముందు ఒక 5MP సెల్ఫీ కెమెరా కూడా అందించారు. నోకియా యొక్క యాజమాన్య AI ఇమేజింగ్ అల్గోరిథం "AI పవర్డ్ లో లైట్ కెమేరా ఫ్యూషన్ " అని పిలువబడుతుంది. అదే AI ఇమేజింగ్ ఫీచర్ HDR ఫోటోలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరియు అది ఒక బ్యూటీ మోడ్ తో పాటుగా ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ లాగా ముందు కెమెరా సహాయపడుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
