HTC వైల్డ్‌ఫైర్ X గొప్ప ఎక్స్చేంజి మరియు బ్యాంక్ ఆఫర్లతో చౌక ధరలో లభిస్తోంది.

HIGHLIGHTS

ఈ ఫోన్ను ముందస్తుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేసేవారికి 1,000 రూపాయల తగ్గిపును కూడా అందిస్తోంది.

HTC వైల్డ్‌ఫైర్ X గొప్ప ఎక్స్చేంజి మరియు బ్యాంక్ ఆఫర్లతో చౌక ధరలో లభిస్తోంది.

భారతదేశంలో HTC  తన పునరాగమనాన్ని సూచిస్తూ, HTC వైల్డ్‌ఫైర్ ఎక్స్  లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులో ఉంది. అలాగే, ఈ ఫోన్ పైన గొప్ప ఎక్స్చేంజి మరియు బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. అధనంగా, ఈ ఫోన్ను ముందస్తుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేసేవారికి 1,000 రూపాయల తగ్గిపును కూడా అందిస్తోంది.  ఈ ఫోన్ ఆగస్టు 14 న ఇనోన్ స్మార్ట్ టెక్నాలజీ లాంచ్ చేసింది, దీనికి హెచ్‌టిసి బ్రాండ్‌ లైసెన్స్ ఇచ్చింది. హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఎక్స్‌లో “మైబడ్డీ ” ఫీచర్ వస్తుంది, ఇది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ను వ్యక్తిగత భద్రతా సాధనంగా ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

HTC వైల్డ్‌ఫైర్ ఎక్స్ ధర మరియు ఆఫర్‌లు

హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఎక్స్ బేస్ వేరియంట్ అయిన, 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌ కేవలం రూ .10,999 వద్ద ప్రారంభమవుతుంది మరియు 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మోడల్‌ రూ .13,999 ధరతో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సఫైర్ బ్లూ కలర్‌లో అందుబాటులోఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో లాంచ్ ఆఫర్‌లలో భాగంగా, వోడాఫోన్ మరియు ఐడియా కస్టమర్లకు రూ.3,750 రూపాయల, ఈ పైకాన్ని యాభై కూపన్లు రూ .75 వోచర్ల రూపంలో అందించబడతాయి అలాగే రోజుకు అదనంగా 500 MB డేటా 18 నెలలకు గాను అందుకుంటారు. , ఇవి మైవోడాఫోన్ లేదా మై ఐడియా యాప్ ద్వారా రూ .255 తో రీఛార్జ్ చేసిన తర్వాత మాత్రమే లభిస్తాయి.

HTC వైల్డ్‌ఫైర్ X లక్షణాలు

హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఎక్స్‌లో ఒక 6.20-అంగుళాల IPS డిస్‌ప్లేను 1520 x 720 పిక్సెల్‌ల వద్ద వాటర్‌డ్రాప్ నాచ్‌తో అందించింది. ఇది 4 జిబి ర్యామ్‌తో జతచేయబడిన హీలియో పి 22 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3,300 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి, ఆండ్రాయిడ్ 9 OS పైన పనిచేస్తుంది.

ఇక కెమెరా విభాగంలో, హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఎక్స్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను 12MP ప్రధాన కెమెరా + 8 MP లెన్స్‌తో (2 X ఆప్టికల్ జూమ్) + 5 MP డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. ముందు భాగంలో, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఒక 8 MP సెల్ఫీ కెమెరాను వాటర్‌డ్రాప్ నోచ్ లో ఇచ్చారు.

పెద్దగా అలారంను మోగించి, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఫోన్ యొక్క ప్రత్యక్ష స్థాన సమాచారాన్ని పంపడానికి మరియు సమీపంలోని  ఆడియో / వీడియోను రియల్ టైంలో రికార్డ్ చేయడానికి మరియు ప్రసారం చేయడానికి వినియోగదారులను షెల్ నుండి ఉపసంహరించుకునేలా చేసే “మైబుడ్డీ” సేఫ్టీ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo