Nothing Phone (3a) Lite లాంచ్ డేట్ ప్రకటించిన నథింగ్.!
Nothing Phone (3a) Lite స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్
ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ మరియు కొన్ని ఫీచర్స్ కూడా రివీల్ చేసింది
Nothing Phone (3a) Lite స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం రెండు వారాలుగా టీజింగ్ చేస్తూ వచ్చిన నథింగ్, ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ప్రైస్ లో వచ్చిన నథింగ్ ఫోన్ (3a) యొక్క లైట్ వెర్షన్ గా ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను ముందుగా యూరప్ మార్కెట్ లో విడుదల చేసిన నథింగ్, ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ చేస్తోంది.
SurveyNothing Phone (3a) Lite : లాంచ్ డేట్
నథింగ్ ఫోన్ (3a) లైట్ స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 27వ తేదీ ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ వివరాలు వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ మరియు కొన్ని ఫీచర్స్ కూడా రివీల్ చేసింది.
Nothing Phone (3a) Lite : ఫీచర్స్
నథింగ్ ఫోన్ (3a) లైట్ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు వెనుక కఠినమైన హై గ్రేడ్ టెంపర్ గ్లాస్ ఉంటుంది. ముందు వచ్చిన ఫోన్స్ మాదిరిగా ఈ ఫోన్ లో కూడా జిఫ్ లైట్ ఉంటుంది. ఈ ఫోన్ కెమెరాలో టైమర్ తో ఫోటోలు తీసేప్పుడు కౌంట్ డౌన్ ను లైట్ లో చూపిస్తుంది మరియు నోటిఫికేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మాక్రో కెమెరా మూడు కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ కెమెరా 4K వీడియో రికార్డింగ్ మరియు AI కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4 నథింగ్ మరియు ఉప బ్రాండ్ CMF నుంచి ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఫోన్స్ తో పోలిస్తే ఈ ఫోన్ చాలా డిఫరెంట్ డిజైన్ కలిగి ఉంటుంది.
Also Read: Realme P Series 5G: కొత్త సిరీస్ ఫోన్స్ లాంచ్ కోసం రియల్ ని టీజింగ్.!
నథింగ్ ఫోన్ (3a) లైట్ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ 5G సపోర్ట్ తో వస్తుంది మరియు ఫోన్ తో ఇచ్చిన స్టోరేజ్ తో పాటు 2TB అదనపు స్టోరేజ్ పెంచుకునే అవకాశం కలిగి ఉంటుంది. దానికోసం SD కార్డ్ ఉపయోగించాల్సి వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Pro 5G చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ Nothing OS 3.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.