Nothing Phone (3a) మరియు Phone (3a) Pro ఫస్ట్ లుక్ అవుట్..ఫోన్ ఎలా ఉందంటే.!

HIGHLIGHTS

Nothing Phone (3a) మరియు Phone (3a) Pro ఫస్ట్ లుక్ వచ్చేసింది

బార్సిలోనా లో జరుగుతున్న MWC 2025 నుంచి ఈ ఫోన్ ను నథింగ్ ప్రదర్శించింది

నథింగ్ అప్ కమింగ్ రెండు ఫోన్లు కూడా డిజైన్ పరంగా ఆకట్టుకుంటున్నాయి

Nothing Phone (3a) మరియు Phone (3a) Pro ఫస్ట్ లుక్ అవుట్..ఫోన్ ఎలా ఉందంటే.!

Nothing Phone (3a) మరియు Phone (3a) Pro ఫస్ట్ లుక్ వచ్చేసింది. రేపు ఇండియాలో విడుదలకు సిద్ధమైన ఈ ఫోన్ ను ఈ రోజే డిస్ప్లేలో ఉంచింది నథింగ్. బార్సిలోనా లో జరుగుతున్న MWC 2025 నుంచి ఈ ఫోన్ ను నథింగ్ ప్రదర్శించింది. ఈ కార్యక్రమం ఈరోజు నుంచి మొదలయ్యింది మరియు ఈ రోజే నథింగ్ ఈ ఫోన్ ను సందర్శకుల కోసం ప్రదర్శించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone (3a) మరియు Phone (3a) Pro ఫస్ట్ లుక్ ఎలా వుంది?

నథింగ్ ఫోన్ (3a) మరియు (3a) ప్రో రెండు ఫోన్లు కూడా ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్ లు మార్చి 4వ తేదీ సాయంత్రం 3:30 గంటలకు లాంచ్ అవుతాయి. అయితే, ఈ ఫోన్ ఫస్ట్ లుక్ ఇప్పుడు బయటకు వచ్చింది.

Nothing Phone (3a) And Phone (3a) Pro

ఈ సిరీస్ నుంచి వస్తున్న నథింగ్ అప్ కమింగ్ రెండు ఫోన్లు కూడా డిజైన్ పరంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా చాలా స్లీక్ డిజైన్ మరియు సరికొత్త కెమెరా మోడ్యూల్ తో కనిపిస్తున్నాయి. నథింగ్ ముందుగా తెచ్చిన ఫోన్స్ మాదిరిగా కాకుండా ఈ ఫోన్ లను స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లను Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్టు చెబుతోంది.

Also Read: Xiaomi 15 Ultra: 8K కెమెరా మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్.!

కెమెరా పరంగా కూడా ఈ రెండు ఫోన్స్ చాలా అప్గ్రేడ్ లను కాలిగోయ్ ఉంటాయి. నథింగ్ ఫోన్ (3a) మరియు (3a) ప్రో రెండు ఫోన్లు కూడా వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. వీటిలో, నథింగ్ (3a) ప్రో స్మార్ట్ ఫోన్ పెరిస్కోప్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు కూడా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటాయని నథింగ్ చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo