Nothing Phone (3) ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన నథింగ్.!

HIGHLIGHTS

Nothing Phone (3) లాంచ్ చేస్తున్నట్లు నథింగ్ అనౌన్స్ చేసింది

ఫోన్ (3) సిరీస్ నుంచి బడ్జెట్ మరియు మీడియం ప్రైస్ సెగ్మెంట్ ఫోన్ లను విడుదల చేసిన నథింగ్

ఇప్పుడు ఈ సిరీస్ ప్రీమియం ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది

Nothing Phone (3) ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన నథింగ్.!

Nothing Phone (3) స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు నథింగ్ అనౌన్స్ చేసింది. నథింగ్ ఫోన్ (3) సిరీస్ నుంచి బడ్జెట్ మరియు మీడియం ప్రైస్ సెగ్మెంట్ ఫోన్ లను విడుదల చేసిన నథింగ్, ఇప్పుడు ఈ సిరీస్ ప్రీమియం ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. నథింగ్ అధికారిక X అకౌంట్ నుంచి ఈ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone (3) : లాంచ్ డేట్

నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Phone (3) ఖచ్చితమైన లాంచ్ డేట్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ జూలై లో లాంచ్ అవుతుందని మాత్రం అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 2025 యొక్క అత్యంత ఎగ్జైటింగ్ ఫోన్ అవుతుందని నథింగ్ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ మొదలు పెట్టింది.

Nothing Phone (3) India Launch

అయితే, ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ ధర మరియు ఫీచర్స్ నెట్టింట్లో ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. గత సిరీస్ మరియు ఇటీవల అందించిన ఫోన్ (3) సిరీస్ ఫోన్స్ కలిగిన ఫీచర్స్ మరియు స్పెక్స్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ ఫీచర్స్ అంచనా వేసి చెబుతున్నారు.

Also Read: ZEBRONICS SILENCIO 111: ప్రీమియం ఫీచర్స్ కొత్త హెడ్ ఫోన్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్.!

Nothing Phone (3) : అంచనా ఫీచర్స్

నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్, ఫోన్ (3) ని 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.7 ఇంచ్ AMOELD LTPO స్క్రీన్ తో లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ కూడా నథింగ్ యొక్క ప్రతిష్టాత్మకమైన Glyph ఇంటర్ఫేస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో అందించే అవకాశం ఉండవచ్చు. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండవచ్చనే రూమర్స్ కూడా వినబడుతున్నాయి.

ఈ ఫోన్ లో మూడు 50MP కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా సెటప్ అందించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. ఇది కాకుండా ఈ ఫోన్ లో 5000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ మరియు 50W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉండవచ్చని ఊహిస్తున్నారు.

అయితే, ఇప్పటి వరకు అందించిన వివరాలు అన్నీ కూడా రూమర్స్ మరియు అంచనా ఫీచర్స్ మాత్రమే అని గమనించాలి. ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo