nothing hints new series phones and reports says may be Nothing (b) Series
Nothing (b) Series: UK బేస్డ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పేరు మరియు వివరాలు ఇంకా అనౌన్స్ చేయకపోయినా, ఈ డివైజ్ గురించి హింట్స్ మరియు చిన్న క్లూ తో టీజర్ విడుదల చేసింది. అయితే, ఇది నథింగ్ నుంచి రాబోతున్న కొత్త సిరీస్ కి సంకేతమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ (b) సిరీస్ పేరుతో లాంచ్ కావచ్చని ఊహిస్తున్నారు.
వాస్తవానికి, (b) సిరీస్ డివైజెస్ లాంచ్ చేస్తున్నట్లు నథింగ్ డైరెక్ట్ గా ప్రకటించ లేదు. అయితే, టీజర్ వీడియోలో అందించిన హింట్స్ మరియు క్లూ తో ఈ సిరీస్ అదే అవుతుందని అంచనా వేసి చెబుతున్నారు. టీజర్ వీడియో ప్రకారం, ఈ అప్ కమింగ్ సిరీస్ ను ముందుగా అందించిన (a) ప్లేస్ లో(b) ని రీప్లేస్ చేసి చూపించింది. అందుకే, ఇది బి సిరీస్ ఫోన్ గా వస్తుందని అంత గట్టిగా చెబుతున్నారు.
ఈ అప్ కమింగ్ సార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా నథింగ్ అనౌన్స్ చేయలేదు. జస్ట్ ఈ అప్ కమింగ్ సిరీస్ కోసం టీజింగ్ మాత్రమే ప్రారంభించింది. కంపెనీ ఇండియా అఫీషియల్ X హ్యాండిల్ నుంచి ఈ అప్ కమింగ్ సిరీస్ కోసం టీజర్స్ విడుదల చేస్తోంది. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ ద్వారా కూడా ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
Also Read: Tick Tock Deal: జెబ్రోనిక్స్ లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
నథింగ్ లేటెస్ట్ గా అందించిన టీజర్ వీడియోలో అప్ కమింగ్ డిజైన్ గురించి హింట్ ఇచ్చింది. ఇందులో కొత్త స్మార్ట్ ఫోన్ వివరాలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఇందులో మొబైల్ డిజైన్ స్కెచ్ వేసిన ఒక పెన్సిల్ ను చూపించింది. ఈ పెన్సిల్ పై 4B అని రాసి ఉంది. అంటే, అప్ కమింగ్ సిరీస్ 4 (b) సిరీస్ అయ్యే అవకాశం అయ్యి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ మరియు డివైజ్ అప్డేట్ లు నథింగ్ త్వరలోనే అందించే అవకాశం ఉంది.