Flipkart BBD Sale నథింగ్ ట్రిపుల్ కెమెరా ఫోన్ ను రూ. 14,999 ధరకే అందుకోండి.!
Flipkart BBD Sale సోమవారం నుంచి ఫ్లిప్ కార్ట్ యూజర్లకు ప్రారంభం అవుతుంది
నథింగ్ లేటెస్ట్ ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ ను రూ. 14,999 ధరకే అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది
అప్ కమింగ్ సేల్ కోసం ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ను ముందుగానే అనౌన్స్ చేసింది
Flipkart BBD Sale వచ్చే సోమవారం నుంచి ఫ్లిప్ కార్ట్ యూజర్లకు ప్రారంభం అవుతుంది. ఈ సేల్ నుంచి నథింగ్ లేటెస్ట్ ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ ను రూ. 14,999 ధరకే అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. అప్ కమింగ్ సేల్ కోసం ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ను ముందుగానే అనౌన్స్ చేసింది. ఈ లేటెస్ట్ నథింగ్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.
SurveyFlipkart BBD Sale : నథింగ్ ఫోన్ డీల్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి ముందుగా ఆఫర్స్ ను సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా అందించిన విష్ లిస్ట్ లో ఈ డీల్ ను లిస్ట్ చేసింది. ఇక డీల్ విషయానికి వస్తే, CMF by Nothing Phone 2 Pro స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్స్ అందించింది. రీసెంట్ గా ఈ ఫోన్ ను ఇండియాలో రూ. 18,999 రూపాయల ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి రూ. 16,999 ప్రైస్ తో లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్స్ తో కేవలం రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కొనాలని చేసే యూజర్లు ఈ ఫోన్ ఆఫర్ ను విష్ లిస్ట్ ద్వారా పరిశీలించవచ్చు.
Also Read: Kodak Matrix సిరీస్ నుంచి బడ్జెట్ ధరలో QLED Smart Tv లు లాంచ్ చేసింది.!
CMF by Nothing Phone 2 Pro : ఫీచర్స్
ఈ స్మార్ట్ ఫోన్ 50MP వైడ్ యాంగిల్, 50MP టెలీ లెన్స్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2x ఆప్టికల్ జూమ్, 20x డిజిటల్ జూమ్, 4K వీడియో రికార్డింగ్ మరియు మంచి కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ AMOLED ఫ్లెక్సిబుల్ LTPS స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ స్క్రీన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Pro 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 7.8mm స్లీక్ మరియు స్టన్నింగ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.