నోకియా X1 యొక్క లీకైన స్కెచ్ స్పెక్స్ గురించి వివరిస్తోంది

నోకియా X1 యొక్క లీకైన స్కెచ్ స్పెక్స్ గురించి వివరిస్తోంది
HIGHLIGHTS

నోకియా X71 యొక్క స్కెచ్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు పంచ్ హోల్ డిస్ప్లేని చూపిస్తుంది.

ఈ ఫోన్ ఒక 48MP ప్రాధమిక సెన్సార్ తో వస్తుందని రూమర్ కూడా వచ్చింది.

క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ జతగా ఒక 6GB RAM తో కలిగివుంది.

ఈ ఫోన్ ఒక 48MP ప్రాధమిక సెన్సార్ తో వస్తుందని రూమర్ కూడా వచ్చింది.

HMD గ్లోబల్ తన నోకియా X71 ని ఏప్రిల్ 2 న, అంటే ఈ రోజు  తైవాన్లో విడుదల చేయనుంది మరియు దాని యొక్క విడుదలకి ముందుగానే, ఈ ఫోన్ యొక్క స్కెచ్ ఇమేజ్ బయటికొచ్చింది. వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పును మరియు ఒక పంచ్ హోల్ డిస్ప్లే గురించి ఈ స్కెచ్ వెల్లడించింది. ఇదే గనుక నిజమైతే,  ఈ డివైజ్   ఆసక్తికరంగా,  ఈ ఫిన్నిష్ దిగ్గజం నుండి ఒక పంచ్ హోల్ డిస్ప్లే మరియు ఒక 48MP ప్రాధమిక సెన్సార్ కలిగిన మొదటి స్మార్ట్ ఫోన్ కావచ్చు.

స్కెచ్ కాకుండా, స్లాష్ లీక్స్ లో  విడుదల చేసిన లీక్ రానున్న ఈ ఫోన్ యొక్క హార్డ్వేర్ స్పెక్స్ కూడా జాబితా చేస్తుంది. అంతరంగా, నోకియా X71 ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ జతగా ఒక 6GB RAM తో కలిగివుంది. గత నెలలో, Geekbench బ్రౌజర్లో ఇది ఒక స్నాప్డ్రాగెన్ 660 చిప్సెట్, 6GB RAM తో సింగిల్-కోర్ టెస్ట్ లో 1455 మరియు మల్టీ-కోర్ టెస్టులో 5075 స్కోరుతో గుర్తించబడింది.

దీని డిస్ప్లే విషయానికి వచ్చినప్పుడు, ఈ ఫోన్ ఒక పంచ్ హోల్ తో 6.4-అంగుళాల పూర్తి HD +డిస్ప్లే ని కలిగి ఉండనట్లు చెప్పబడింది. అయితే, ఇది ఎటువంటి ప్యానల్ తో అందించనున్నదన్న (LCD లేదా OLED) విషయాన్నినిర్ధారించలేదు. అలాగే, డిస్ప్లేలో అందించిన పంచ్ హాల్ లోపల ఉంచబడే కెమెరా యొక్క రిజల్యూషన్ పైన కూడా ఎటువంటి సమాచారం లేదు. ఈ ఫోన్ 3500mAh బ్యాటరీతో ఉందని, ఆండ్రాయిడ్ 9 పై భాగంలో నడుస్తుందని మాత్రం చెప్పబడింది. Google యొక్క Android One ప్రోగ్రామ్ కింద ఫోన్ ప్రారంభించనున్నట్లుగా, సూచించే Android One బ్రాండింగును స్కెచ్ చూపిస్తుంది.

ఇందులోని, వెనుక కెమెరా సెటప్ మూడు సెన్సార్లతో రాబోతుందని చెప్పబడింది. ఇందులో ప్రాధమిక సెన్సార్ 48MP ఒకటి అని అంచనావేయబడింది.  అయితే, ఇది సోనీ లేదా శామ్సంగ్ ద్వారా అందించే 48MP సెన్సార్ను ఉపయోగించనుంది అనే దానిపై నిర్ధారణ లేదు. మిగిలిన రెండు సెన్సార్లు 8MP మరియు 5MP కెమెరాలుగా ఉండవచ్చు. ఈ ద్వితీయ కెమెరాలు 120-డిగ్రీ వైడ్ -యాంగిల్ లెన్స్ కలిగి ఉండవచ్చని గత నివేదికలు సూచించాయి. అయితే, ఒక ఫోరమ్ ఈ స్మార్ట్ ఫోన్ మరియు నోకియా 6.2 రెండు కూడా వేర్వేరు ఫోన్లని చెప్పింది  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo