నోకియా 4.2 కోసం కొత్త అప్డేట్ విడుదల : ఇక డ్యూయల్ 4G VoLTE కి సపోర్ట్ చేస్తుంది

నోకియా 4.2 కోసం కొత్త అప్డేట్ విడుదల : ఇక డ్యూయల్ 4G VoLTE కి సపోర్ట్ చేస్తుంది
HIGHLIGHTS

ఈ కొత్త అప్డేట్ యొక్క పరిమాణం కేవలం 1.3 GB మాత్రమే.

HMD గ్లోబల్ ఎప్పటికప్పుడు అన్ని నోకియా ఫోన్ల పైన అప్డేట్స్ విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి ఈ కంపెనీ భారతదేశంలోని నోకియా 4.2 కు మరోసారి సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్ Android సెక్యూరిటీ ప్యాచ్‌తో వస్తుంది. నివేదికల ప్రకారం, ఈ అప్డేట్ డ్యూయల్ 4 G VoLTE సపోర్టును అందిస్తుంది. గాడ్జెట్స్ 360 నివేదిక ప్రకారం, HMD గ్లోబల్ భారతదేశంలో ఈ అప్డేటును ప్రారంభించింది. ఈ కొత్త అప్డేట్ యొక్క పరిమాణం కేవలం 1.3 GB మాత్రమే.

వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ల మెరుగుదల కూడా ఇందులో చేర్చబడింది. నోకియా పవర్ యూజర్ యొక్క నివేదిక ప్రకారం, నోకియా 4.2 స్మార్ట్‌ఫోన్ కోసం హెచ్‌ఎండి గ్లోబల్ ఆండ్రాయిడ్ పై ఆధారంగా ఒక కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఫోన్ సెట్టింగులకు వెళ్లడం ద్వారా వినియోగదారులు ఈ క్రొత్త అప్డేటును చెక్ చేయవచ్చు.

నోకియా 4.2 ప్రత్యేకతలు

ఈ నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ 720 x 1520 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 5.71 అంగుళాల HD+ LCD డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా, ఈ డిస్ప్లేని ఒక U ఆకారంలో వున్న నోచ్ డిజైన్ తో అందించారు మరియు ఈ నోచ్ లో సెల్ఫీ కెమేరా ఉంటుంది. ఇది ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో, ఎక్కువ స్క్రీన్ స్థలాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెస్సర్ శక్తితో నడుస్తుంది. ఇది 3GB ర్యామ్ కి జతగా  32GB స్టోరేజితో లభిస్తుంది.  అలాగే, మైక్రో SD కార్డుతో 400GB వరకు మెమొరీ సామర్ధ్యాన్ని పెంచుకునే వీలుంటుంది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, f/2.2 అపర్చరు  కలిగిన ఒక 13MP ప్రధాన కెమేరాకి జతగా మరొక 2MP ( f/2.2) డెప్త్ కెమేరాతో, డ్యూయల్ రియర్ కెమెరాని అందించారు. ముందుభాగంలో, ఒక 8MP కెమేరాని f /2.0 అపర్చరుతో అందించారు. అయితే, ఇందులో గూగుల్ అసిస్టెంట్ కోసం ఒక డేడికేటెడ్ బటన్ అందించింది. ఇందులో 3,000 mAh ఇంటిగ్రేటెడ్ బ్యాటరీని అందించింది. ఇది Android 9 Pie OS పైన నడుస్తుంది మరియు ఆండ్రాయిడ్ వన్ కార్యక్రంలో భాగంగా ఉంటుంది కాబట్టి అప్డేట్లను త్వరగా అందుకుంటుంది.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo