నోకియా లేటెస్ట్ 5G ఫోన్ నవంబర్ 8 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.!
Nokia G60 5G నవంబర్ 8 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది
ఈ ఫోన్ తో కస్టమర్లకు 3 మేజర్ అప్డేట్స్ ను కంపెనీ అఫర్ చేస్తోంది
ఈ ఫోన్ తో ఫ్యూచర్ అప్డేట్స్ గురించి ఎటువంటి బెంగా పడాల్సిన అవసరం లేదు
నోకియా ఇండియాలో లేటెస్ట్ గా ప్రకటించిన సరికొత్త 5G ఫోన్ Nokia G60 5G నవంబర్ 8 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. నోకియా ఈ ఫోన్ ను Snapdragon 695 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ తో కస్టమర్లకు 3 మేజర్ అప్డేట్స్ ను కంపెనీ అఫర్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ తో ఫ్యూచర్ అప్డేట్స్ గురించి ఎటువంటి బెంగా పడాల్సిన అవసరం లేదు. మరో రెండు రోజుల్లో సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ నోకియా 5G ఫోన్ పూర్తి డీటెయిల్స్ ను క్రింద చూడవచ్చు.
SurveyNokia G60 5G: ధర
Nokia G60 5G స్మార్ట్ ఫోన్ ను రూ.29,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్ మరియు ఐస్ రెండు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ Nokia.com ద్వారా నవంబర్ 8 నుండి విక్రయించబడుతుంది. అంతేకాదు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్ లెట్‌లలో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ను ఈరోజు నుండి నవంబర్ 7 వ తేదీ వరకూ ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు మరియు ఆర్డర్ చేసే కస్టమర్లు రూ.3,599 రూపాయల విలువైన నోకియా వైర్డ్ బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు.
Nokia G60 5G: స్పెక్స్ మరియు ఫీచర్లు
నోకియా జి 60 5జి స్మార్ట్ ఫోన్ Snapdragon 695 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 6 జీబీ ర్యామ్ మరియు 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. Nokia G60 5G పెద్ద 6.58 -అంగుళాల FHD+ స్క్రీన్ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్ 5 ని కంపెనీ అందించింది. ఈ డిస్ప్లే మరియు ఫోన్ కు పవర్ ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5000 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబడింది.
నోకియా జి 60 5జి లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది AI Portrait, డార్క్ విజన్, నైట్ సెల్ఫీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Android 12 OS పైన నడుస్తుంది మరియు 3 మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుందని కంపెనీ తెలిపింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile