Nokia G11 Plus: సేల్ కి అందుబాటులోకి వచ్చిన నోకియా 50MP బడ్జెట్ ఫోన్.!

HIGHLIGHTS

Nokia G11 Plus సేల్ కి అందుబాటులోకి వచ్చింది

Nokia G11 Plus స్మార్ట్ ఫోన్ 50MP కెమెరాతో పాటుగా మరిన్ని ఫీచర్లతో వచ్చింది

భారతీయ బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించే విధంగా నోకియా ఈ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది

Nokia G11 Plus: సేల్ కి అందుబాటులోకి వచ్చిన నోకియా 50MP బడ్జెట్ ఫోన్.!

నోకియా ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Nokia G11 Plus సేల్ కి అందుబాటులోకి వచ్చింది. నోకియా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కూడా బడ్జెట్ ధరలోనే ప్రవేశపెట్టబడింది. Nokia G11 Plus స్మార్ట్ ఫోన్ 50MP కెమెరాతో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది.  భారతీయ బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించే విధంగా నోకియా ఈ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nokia G11 Plus: ఫీచర్లు

నోకియా జి 11 స్మార్ట్‌ ఫోన్ Unisoc T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ మరియు 64 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి మైక్రో SD అప్షన్ వుంది. Nokia G11 పెద్ద 6.5-అంగుళాల HD+ స్క్రీన్‌ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే మరియు ఫోన్ కు పవర్ ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది.

నోకియా జి 11 లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.  ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Stock Android 12 OS పైన నడుస్తుంది మరియు రెండు మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుంది.

Nokia G11 Plus: Price

నోకియా జి11 కేవలం 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో వస్తుంది మరియు దీని ధర రూ.12,499. ఈ ఫోన్ చార్కోల్ గ్రే మరియు లేక్ బ్లూ అనే రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile