Nokia D1C స్మార్ట్ ఫోన్ AnTuTu స్కోర్స్ అండ్ డిటేల్స్ లీక్
By
Shrey Pacheco |
Updated on 04-Nov-2016
నోకియా D1C స్మార్ట్ ఫోన్ వస్తుంది అని రీసెంట్ గా లీక్ అయిన గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా మనం తెలుకున్నాము. ఇప్పుడు అది నిజమే అన్నట్లు మరొక సారి నెట్ లో కనిపించింది..
Survey✅ Thank you for completing the survey!
Playful Droid ద్వారా AnTuTu స్కోర్స్ లో ఫోన్ యొక్క డిటేల్స్ బయట పడ్డాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా షేర్ అయ్యింది. స్కోర్స్ ఇమేజ్ ఆర్టికల్ క్రింద ఉంది.. సో దాని ప్రకారం…
ఫోన్ లో ఫుల్ HD డిస్ప్లే, ఆండ్రాయిడ్ N, స్నాప్ డ్రాగన్ 430 SoC, 3GB రామ్, 13MP అండ్ 8MP కేమేరాస్, 32GB స్టోరేజ్ ఉన్నాయి. ఇవే స్పెక్స్ రీసెంట్ గా లీక్ అయిన బెంచ్ మార్క్ లిస్టింగ్ లో కూడా కనిపించాయి.
D1C ఫోన్ స్కోర్స్ కూడా అండర్ 9K లో బెస్ట్ ఫోన్ గా చలామణి అవుతూ స్నాప్ డ్రాగన్ 430 SoC/3GB రామ్ ఉన్న Xiaomi రెడ్మి 3S Prime స్కోర్స్ కు దగ్గరిలో ఉన్నాయి.
