రూ.5,999 ధరకే లేటెస్ట్ నోకియా స్మార్ట్ ఫోన్ లాంచ్

HIGHLIGHTS

ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్

రిలయన్స్ Jio Exclusive Offer జతగా లాంచ్

ఆండ్రాయిడ్ 11 OS (గో ఎడిషన్) తో వస్తుంది

రూ.5,999 ధరకే లేటెస్ట్ నోకియా స్మార్ట్ ఫోన్ లాంచ్

Nokia C01 Plus స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో భారీ అంచనాలతో మార్కెట్లోకి వచ్చింది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా కేవలం రూ.5,999 రూపాయల ధరకే ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఈ స్మార్ట్ ఫోన్ రిలయన్స్ Jio Exclusive Offer జతగా లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం (గో ఎడిషన్) మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. ఈ లేటెస్ట్ నోకియా స్మార్ట్ ఫోన్ గురించి అన్ని వివరాలను ఈ క్రింద చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nokia C01 Plus: ప్రైస్&ఆఫర్స్

ఈ నోకియా సి01 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ.5,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను జియో ఎక్స్ క్లూజివ్ అఫర్ క్రింద కొనేవారికి 10% ఇన్స్టాంట్ ప్రైస్ సపోర్ట్ లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను కేవలం రూ.5,399 రూపాయల ధరకే పొందవచ్చు. ఈ ఫోన్ అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్స్, ఇకామర్స్ మరియు నోకియా అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తుంది. 

Nokia C01 Plus: స్పెక్స్

నోకియా సి01 ప్లస్ స్మార్ట్ ఫోన్ 5.45 ఇంచ్ HD డిస్ప్లేని కలిగివుంది. ఈ ఫోన్ 1.6 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. అలాగే, 2జిబి ర్యామ్ మరియు 16జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో అవస్తుంది.ఈ నోకియా బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS (గో ఎడిషన్) తో వస్తుంది మరియు రెండు సంవత్సరాల వరకూ అప్డేట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 5MP సింగిల్ కెమెరా HDR సపోర్ట్  వుంది మరియు ఫ్రెంట్ 2MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 3000 mAh రిమూవబుల్ బ్యాటరీని మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ ను కూడా కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo