భారీ డిస్కౌంట్ తో నోకియా 7.2 స్మార్ట్ ఫోన్ అమ్మకం : ఇవే టాప్ 5 ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోనులో మీకు 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది.
ఇటివల, నోకియా 7.2 మొబైల్ ఫోన్ను భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచారు. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోనులో మీకు 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. అధనంగా, ఇందులో మీరు HDR డిస్ప్లేను కూడా పొందుతారు. ఈ మొబైల్ ఫోన్ను నోకియా సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు అనేక రిటైల్ దుకాణాల నుండి కొనుగోలు చేయవచ్చు. అయితే అమెజాన్ నుండి అత్యంత తక్కువ ధరతో కొనవచ్చు. ఎందుకంటే, అన్ని ప్లాట్ఫారాలతో పోలిస్తే , అమెజాన్ అత్యంత కనిష్ట ధరకు అమ్ముతోంది.
Surveyనోకియా 7.2 : లేటెస్ట్ ధరలు
ఈ నోకియా 7.2 ఇండియాలో విడుదలకి చేసినప్పుడు, 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .18,599 కాగా, 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .19,599 గా ఉండేది. ఈ స్మార్ట్ ఫోన్ (4GB +64GB) ప్రస్తుతం అమేజాన్ ఇండియా నుండి రూ.14,847 రూపాయల ధరకు అమ్ముడవుతోంది. కానీ, నోకియా అధికారిక వెబ్సైట్, Flipkart మరియు ఆఫ్ లైన్ స్టోర్ల నుండి ఇదే వేరియంట్ రూ. 15,999 రుపాయల ధరతో అమ్ముడవుతోంది.
ఇక మీ ఫోన్ గురించి మీరు తెలుసుసుకోవాల్సిన టాప్ 5 ఫీచర్లను కూడా ఇక్కడ తెలుసుకోండి.
నోకియా 7.2 టాప్ 5 ఫీచర్లు
1. నోకియా 7.2 డిస్ప్లే
ఈ నోకియా 7.2 ఒక 6.3-అంగుళాల ఫుల్ -HD + డిస్ప్లే తో విడుదల చేయబడింది. ఇది HDR 10 కి మద్దతు ఇస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది. అంటే, అత్యున్నత రిజల్యూషన్ తో సినిమాలు లేదా వీడియోలను, యూట్యూబ్, అమేజాన్ ప్రైమ్ మరియు నెట్ ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫారాలా పైన చూడవచ్చు.
2. నోకియా 7.2 ప్రాసెసర్
ఈ నోకియా స్మార్ట్ ఫోన్ ఒక ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 SoC యొక్క శక్తిని కలిగి ఉంది మరియు ఇది 6GB RAM తో జత చేయబడింది. ఈ ఫోనులో 128 జీబీ స్టోరేజ్ ఉంది, దీనిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 512 జీబీకి పెంచవచ్చు. అధనంగా, ఇది మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ శక్తి వస్తుంది.
3. నోకియా 7.2 కెమెరా
నోకియా 7.2 లో ఒక 48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా మరియు f/ 1.79 ఎపర్చరుతో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇక రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 2.2 గా ఉంటుంది. ఇక మూడవ కెమెరాగా 5 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్ ఉంది. అలాగే, సెల్ఫీల కోసం ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా అందించబడింది. నోకియా స్మార్ట్ ఫోన్ల యొక్క కెమేరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మంచి ఫోటోగ్రఫీని మీకు ఇస్తుంది.
4. నోకియా 7.2 కనెక్టివిటీ
కనెక్టివిటీ కోసం, నోకియా 7.2 లో 4G VoLTE, వై-ఫై 802.11 AC , బ్లూటూత్ V 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ అందించబడుతుంది. ఇందులో ఒక 3,500 mAh బ్యాటరీని అందించారు మరియు ఫోన్ 159.88×75.11×8.25 మిమీ కొలతలతో ఉంటుంది.
5. నోకియా 7.2 OS
ఈ నోకియా 7.2 ను ఆండ్రాయిడ్ 9 పై తో లాంచ్ చేశారు మరియు స్మార్ట్ ఫోన్ను ఆండ్రాయిడ్ 10 కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ నోకియా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా . ఇది కాకుండా, ఈ స్మార్ట్ ఫోన్ మూడు సంవత్సరాలు నెలవారీ సెక్యూరిటీ అప్డేట్లను మరియు రెండు సంవత్సరాల OS అప్డేట్లను అందుకుంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
