Nokia 6.2 స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది : బడ్జెట్ ధరలో ఒక పంచ్ హోల్ హోల్ డిస్ప్లేతో రానుంది.

HIGHLIGHTS

ఈ అంచనాల ప్రకారం అది రూ. 11,999 మరియు రూ. 13,999 మధ్య ఉంటుంది.

Nokia 6.2 స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది : బడ్జెట్ ధరలో ఒక పంచ్ హోల్ హోల్ డిస్ప్లేతో రానుంది.

నోకియా తన ఐదు -కెమెరాల  స్మార్ట్ ఫోన్ అయినటువంటి, Nokia 9 PureView,ని  MWC 2019 లో ప్రదర్శించింది మరియు ఈ కార్యక్రమంలో నోకియా 3.2 మరియు నోకియా 4.2 స్మార్ట్ ఫోన్లను కూడా ప్రారంభించింది. అయితే,  ప్రస్తుతం పుకార్లలో ఉన్నటువంటి నోకియా 6.2 ను కూడా ప్రకటించాలని, నోకియా సంస్థ అనుకుంది కాని ఇది కొన్ని కారణాల వలన జరగలేదు. కానీ, @ నోకియా_న్యూ వాదనల ప్రకారం ఈ నోకియా 6.2 స్మార్ట్ ఫోన్ను"త్వరలోనే – ఈ వసంతంలో" విడుదల చేయనున్నట్లు  తెలుస్తోంది. అదనంగా, ఈ ట్వీట్ రాబోయే కొత్త డివైజ్  నోకియా 6.1 యొక్క ధరకే ఉండవచ్చని,మరియు ఇది ఒక మిడ్ -రేంజ్  ఫోనుగా  చెప్పవచ్చు, ఈ అంచనాల ప్రకారం అది రూ. 11,999 మరియు రూ. 13,999 మధ్య ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా వచ్చిన ఒక నివేదిక, ఈ నోకియా 6.2 స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని ఫిచర్లని వివరించింది. ఇది ఒక సెల్ఫీ కెమెరా కోసం ఒక పంచ్ హోల్ డిజైన్ కలిగి ఒక  6.2-అంగుళాల డిస్ప్లేతో ఉండనున్నట్లు పుకార్లు పుట్టించింది. దీని ప్రకారంగా చూస్తే గనుక, ఈ ఫోన్ యొక్క డిజైన్  దాదాపుగా శామ్సంగ్ గెలాక్సీ A8s మరియు హానర్ వ్యూ లో చూసినదాని వలెనే ఉంటుంది. అలాగే ఇది ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 SoC శక్తితో మరియు 4GB లేదా 6GB RAM తో రావచ్చు.

ఇక కెమెరా విభాగంలో, ఈ నోకియా 6.2 స్మార్ట్ ఫోన్ ZEISS ఆప్టిక్స్ మరియు 16MP సెన్సార్లని కలిగిన ఒక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చని  చెబుతుంది. ఈ ఫోన్ మొట్టమొదటిసారిగా చైనా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు అంచనావేస్తునారు. ఈ ట్వీట్ లో ఈ ఫోన్ OZO ఆడియోను కలిగి ఉండవచ్చని పేర్కొంది, ఇది ఒక అధునాతన ప్రాదేశిక ఆడియో టెక్, ఇది ఆడియోని తీసుకొని మనకు రియల్ లైఫ్ ఆడియో వలన తిరిగి అందించడాకిని సహాయపడుతుందని, నోకియా చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo