NOKIA 6.2 ఇండియాలో మిడ్ రేంజ్ ధరతో విడుదలయ్యింది.

NOKIA 6.2 ఇండియాలో మిడ్ రేంజ్ ధరతో విడుదలయ్యింది.
HIGHLIGHTS

అమెజాన్ ఇండియా నుండి ఈ ఫోన్ యొక్క అమ్మకాలను కూడా ప్రారంభించింది

గత నెలలో IFA 2019 సందర్భంగా తీసుకొచ్చిన నోకియా 6.2 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియాలో కూడా విడుదలయ్యింది. HMD గ్లోబల్ సంస్థ ఈ నోకియా 6.2 ఫోన్ను ఒక మిడ్ రేంజ్ ఫోనుగా తీసుకొంచింది. ఈ ఫోన్ను రూ.15,999 రూపాయల ధరతో ఇండియాలో లాంచ్ చేసింది.  అంతేకాదు, అమెజాన్ ఇండియా నుండి ఈ ఫోన్ యొక్క అమ్మకాలను కూడా ప్రారంభించింది 

నోకియా 6.2 ప్రత్యేకతలు

ఈ  నోకియా 6.2 స్మార్ట్ ఫోన్ HDR 10 మద్దతు ఇవ్వగల ఒక 6.3-అంగుళాల FHD + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 యొక్క రక్షణను కలిగి ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్‌ కి జతగా 4 GB ర్యామ్‌ మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది. ఒక డేడికేటెడ్ మెమొరీ కార్డుతో దీని స్టోరేజిని 512 GB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 3,500 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడుతుంది మరియు డ్యూయల్ సిమ్‌తో కూడిన ఈ నోకియా ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై OS తో నడుస్తుంది.

ఈ నోకియా 6.2 లో, వెనుక  f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక ప్రధాన 16MP కెమేరాకు జతగా ఒక 8 MP అల్ట్రా వైడ్ సెన్సారు మరియు 5MP డెప్త్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరాని అందించారు. అలాగే, ముందుభాగంలో ఒక 8MP సెల్ఫీ కెమెరాని ఇచ్చారు.  ఈ నోకియా 6.2 యొక్క ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128 జిబి వరకు ఉంది. కనెక్టివిటీ ఫీచర్లలో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, జిపిఎస్ మరియు 4G LTE  వంటివి ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo