గీక్ బెంచ్ పైన కనిపించిన నోకియా 6.2 మరియు నోకియా 7.2 స్మార్ట్ ఫోన్లు

గీక్ బెంచ్ పైన కనిపించిన నోకియా 6.2 మరియు నోకియా 7.2 స్మార్ట్ ఫోన్లు
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ 9 పై తో నడుస్తున్నట్లు జాబితా చేయబడింది.

నోకియా సంస్థ అతిత్వరలోనే, నోకియా 6.2 మరియు నోకియా 7.2 అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడానికి పనిచేస్తునట్లు అనుమానిస్తున్నారు. ఇప్పుడు,ఈ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఈ సంవత్సరం IFA లో పాల్గొంటానని ఒక రెండు కొత్త ఫోన్లను ప్రకటించే  అవకాశం కనిపిస్తుంది. అయితే, ఈ నోకియా 7.2 తన అధికారిక ప్రకటనకు ముందే గీక్బెంచ్ పైన దర్శనమిచ్చింది, ఇది ఈ పరికరం యొక్క కొన్ని ప్రత్యేకతలను వెల్లడించింది. ఈ లిస్టింగ్ ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్ 1.84GHz వద్ద క్లాక్ చేయబడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తినివ్వగలదు మరియు ఇది 6GB RAM తో జతచేయబడవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లో ఉపయోగించిన ప్రాసెసర్  ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ఇది గతంలో వచ్చిన స్నాప్‌డ్రాగన్ 660 SoC లేదా స్నాప్‌డ్రాగన్ 710 SoC గా అయ్యి ఉండవచ్చని నివేదించబడింది.

అంతేకాదు, ఈ గీక్బెంచ్ యొక్క పరీక్షలలో నోకియా 7.2 సింగిల్-కోర్ నుండి 1604 స్కోరు మరియు మల్టీ-కోర్ నుండి 5821 స్కోరును సాధించగలిగింది. ఆశ్చర్యకరంగా, ఇది ఆండ్రాయిడ్ 9 పై తో నడుస్తున్నట్లు జాబితా చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ ర్యామ్‌తో జాబితా చేయగా, ఇది 4 జీబీ ర్యామ్‌తో మరియు 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్‌లతో రాబోతోంది. ఇది ఒక 6.18-అంగుళాల 18.7: 9 ఐపిఎస్ ఎల్‌సిడి డిస్ప్లేను 2340 × 1080p రిజల్యూషన్ మరియు HDR  10 సపోర్ట్‌తో కలిగి ఉంటుంది. వెనుకవైపు, ఫోన్‌లో 48 MP కెమెరా అమర్చబడిందని చెబుతున్నారు. ఇది క్వాల్‌కామ్ క్విక్  ఛార్జ్  మద్దతు కలిగిన  ఒక 3500 ఎంఏహెచ్ బ్యాటరీతో దీన్ని తీసుకువస్తుంది .

ఇక నోకియా 6.2 విషయానికొస్తే, ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 660 SoC యొక్క శక్తితో రావచ్చు మరియు ఇది 4GB మరియు 6GB RAM తో 64 మరియు 128GB స్టోరేజితో ప్రకటించబడవచ్చు. ఇది ఒక 6.18-అంగుళాల 18.7: 9 ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో 2340 × 1080p రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది వెనుకవైపు 48 MP కెమెరాను కలిగి ఉండవచ్చు మరియు ఇది కూడా  క్వాల్‌కామ్ క్విక్  ఛార్జ్  మద్దతు కలిగిన  ఒక 3500 ఎంఏహెచ్ బ్యాటరీతో దీన్ని తీసుకువస్తుంది .

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo