నోకియా 6.1 ప్లస్ 6GB ర్యామ్ వేరియంట్ పైన రూ. 6,500 భారీ డిస్కౌంట్

నోకియా 6.1 ప్లస్ 6GB ర్యామ్ వేరియంట్ పైన రూ. 6,500 భారీ డిస్కౌంట్
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 16MP + 5MP తో డ్యూయల్ - కెమెరా సెటప్ ఉంటుంది

ఈ నోకియా 6.1 ఒక స్నాప్ డ్రాగన్ 636 SoC మరియు డ్యూయల్ కెమెరా సెటప్ తో  మరియు ఆకట్టుకునే డిజనుతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ పెయిన్ అమెజాన్ ఇండియా గొప్ప డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి వేరియంట్ 18,499 రూపాయల ధరతో మార్కెట్లో  విడుదల చెయ్యబడింది. అయితే, అమెజాన్ అందిస్తున్న 6,500 డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ యొక్క 6GB స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.11,999 ధరతో లభిస్తోంది.            

Nokia 6.1 Plus  స్పెసిఫికేషన్స్

నోకియా 6.1 ప్లస్  డ్యూయల్ – సిమ్  స్మార్ట్ ఫోన్, బాక్స్ నుండి బయటకు వస్తూనే ఆండ్రాయిడ్ ఒరెయో తో పనిచేస్తుంది. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ కావడం వలన మనకి టైం ప్రకారం అప్డేట్స్ అందుతాయి. ఈ డివైజ్ 19: 9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన 1080 x 2280 పిక్సల్స్ రిజల్యూషన్ గా కలిగిన 5.8 అంగుళాల పూర్తి హెచ్ డి +  డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3  రక్షణతో  అందించబడింది.

 నోకియా 6.1 ప్లస్ స్నాప్ డ్రాగన్ 636 SoC, 6జీబీ LPDDR 4X ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి  తో అనుసంధానమవుతుంది.  స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 16MP + 5MP తో డ్యూయల్ – కెమెరా సెటప్ ఉంటుంది, ఇంకా ముందు భాగంలో సెల్ఫీల కోసం  16MP  కెమెరా ఉంటుంది. 64జీబీ  అంతర్గత మెమొరీలతో పాటుగా (దాదాపు 400జీబీ వరకు) స్టోరేజీ విస్తరించగల స్మార్ట్ ఫోన్. ఒక 3060mAh బ్యాటరీ మొత్తం ప్యాకేజీకి అవసరమైన  శక్తినందిస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo