నోకియా 5.2,6.2 మరియు నోకియా 7.2 ఈ నేల 11 న ఇండియాలో విడుదలకానున్నాయి

నోకియా 5.2,6.2 మరియు నోకియా 7.2 ఈ నేల 11 న ఇండియాలో విడుదలకానున్నాయి
HIGHLIGHTS

ఈ ఫోన్లు ఈ సంవత్సరం చివరి నాటికల్లా ఆండ్రాయిడ్ 10 కి అప్డేట్ చేయబడతాయి.

రేపు సెప్టెంబర్ 5 వ తేదిన,  నోకియా తన కొత్త స్మార్ట్‌ ఫోన్లను IFA 2019 లో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా, సెప్టెంబర్ 11 న జరగనున్న ప్రత్యేక కార్యక్రమానికి కూడా కంపెనీ తరపున భారత్‌కు మీడియా ఇన్‌వాయిస్‌లు పంపడం ప్రారంభించింది, ఇక్కడ కంపెనీ నోకియా 7.2, నోకియా 6.2, నోకియా 5.2 ఫోన్‌లను విడుదల చేయనుంది. ఈ ఫోనులు ఆండ్రాయిడ్ 9 పై తో ప్రారంభించబడతాయి, అయితే, ఈ ఫోన్లు ఈ సంవత్సరం చివరి నాటికల్లా ఆండ్రాయిడ్ 10 కి అప్డేట్ చేయబడతాయి.

మునుపటి రిపోర్ట్స్ ప్రకారం, ఈ నోకియా 6.2 కు ఒక 6.18-అంగుళాల 18.7: 9 ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే 2340 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌కు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 చిప్‌సెట్ ఉంటుంది మరియు ఈ ఫోన్ 4 జిబి మరియు 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి మరియు 128 జిబి స్టోరేజ్ తో లభిస్తాయి. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో 48 MP కెమెరా అందుబాటులో ఉంటుంది మరియు ఈ ఫోన్‌లో 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించబడుతుంది, ఇది క్వాల్‌కామ్ యొక్క క్విక్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.

ఇక నోకియా 7.2 యొక్క స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 710 చిప్‌సెట్ లభిస్తుంది మరియు ఇది 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. ఈ మొబైల్ ఫోన్‌లో 48 MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు మరియు ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంటుంది. ఒక ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో ఈ ఫోన్ తీసుకురాబడుతుంది మరియు 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వబడుతుంది. మొబైల్ ఫోన్‌లో హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఇవ్వబడుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రారంభించబోయే మూడవ ఫోన్ నోకియా 5.2, ఇది స్నాప్‌డ్రాగన్ 632 చిప్‌సెట్ ద్వారా శక్తినివ్వనుంది.

ఈ మూడు పరికరాల ధరలు ఇంకా తెలియలేదు, అయితే ఈ ఫోన్‌ల ధర నోకియా 5.1, నోకియా 6.1 మరియు నోకియా 7.1 ధరలకు దగ్గరగా  ఉంటుందని అంచనా. ఈ మూడు ఫోన్లు వాటర్‌డ్రాప్ నాచ్‌తో తీసుకురాబడతాయి, అయితే, ఈ ఫోన్‌ల యొక్క ఫీచర్లు ఇంకా నిర్ధారించబడలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo