Motorola Razr 60 స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఇండియాలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ను స్ట్రాంగ్ డిజైన్ మరియు పటిష్టమైన టైటానియం హింజ్ తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా టీజింగ్ చేస్తోంది. ముఖ్యంగా, ఈ ఫోన్ మూడు భయంకరమైన కూల్ ఫీచర్స్ కలిగి ఉంటుందని మోటోరోలా కూల్ గా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ మోటోరోలా ఫ్లిప్ ఫోన్ కలిగిన ఆ కూల్ ఫీచర్స్ మరియు ఈ ఫోన్ ఇతర వివరాలు ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Motorola Razr 60: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ మే 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ను మోటోరోలా అందించింది.
మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ 100% ట్రూ కలర్ కెమెరాతో వీడియో జెశ్చర్ ఫీచర్ కలిగిన వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ అని ఈ ఫోన్ గురించి మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ పర్ల్ అసిటేట్ మరియు ఫ్యాబ్రిక్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ 5 లక్షలకు పైగా ఫ్లిఫ్స్ అందించే పటిష్టమైన టైటానియం రీ ఇన్ ఫోర్స్ హింజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మార్బుల్ ఫినిష్, వేగాన్ లెథర్ మరియు లగ్జరీ ఫ్యాబ్రిక్ ఫినిష్ తో కూడా వస్తుంది.
ఈ అప్ కమింగ్ ఫోన్ మధ్యకు మడత పెట్టే 6.9 ఇంచ్ LTPO స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. స్మార్ట్ వాటర్ టచ్ సపోర్ట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన పెద్ద వెలుపలి స్క్రీన్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా ఈ ఫోన్ ను ఇంప్రూవ్డ్ AI పెర్ఫార్మెన్స్ అందించే మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7400x తో అందిస్తోంది.
ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ అండ్ మైక్రో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా moto ai సపోర్ట్ తో వస్తుంది. ఇది ఇమేజ్ స్టూడియో ఫీచర్ కలిగి ఉంటుంది మరియు ఈ ఫీచర్ కలిగిన AI సపోర్ట్ తో ఇమేజ్ ను యూజర్ కోరుకున్న విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile