Motorola Razr 60: కూల్ డిజైన్ మరియు ఫీచర్స్ తో వచ్చింది.!
మోటోరోలా రేజర్ సిరీస్ నుండి కొత్త ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది
Motorola Razr 60 ను కూల్ డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది
ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ ను అండర్ 50 వేల రూపాయల బడ్జెట్ లో లగ్జరీ ఫీచర్స్ తో అందించింది
Motorola Razr 60: మోటోరోలా రేజర్ సిరీస్ నుండి కొత్త ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కూల్ డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ ను అండర్ 50 వేల రూపాయల బడ్జెట్ లో లగ్జరీ ఫీచర్స్ తో అందించింది. మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyMotorola Razr 60 : ప్రైస్
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను సింగల్ వేరియంట్ తో రూ. 49,999 ధరతో అందించింది. ఈ ఫోన్ గ్రెబల్టార్ సీలైటెస్ట్ స్కై మరియు స్ప్రింగ్ బడ్ మూడు కలర్స్ లో లభిస్తుంది. జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది.
Motorola Razr 60 : ఫీచర్స్
మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ 6.9 ఇంచ్ మడతపెట్టే ఫోల్డబుల్ AMOLED మెయిన్ స్క్రీన్ మరియు 3.6 ఇంచ్ వెలుపలి OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ HDR10+, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫ్లిప్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400X చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

ఈ మోటోరోలా ఫ్లిప్ ఫోన్ గట్టి డిజైన్ మరియు టైటానియం హింజ్ కలిగి గొప్ప మన్నిక అందిస్తుందని మోటోరోలా తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు మార్బుల్ ఫినిష్ కలిగిన మొదటి ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ లో వెనుక 50MP మరియు 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో పాటు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 4K UHD వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు టన్నుల కొద్దీ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: లేటెస్ట్ 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ ని డిస్కౌంట్ ధరకే అందించిన అమెజాన్.!
మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. ఇది 3 ప్రధాన OS అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ అప్డేట్స్ అందుకుంటుంది. మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను 4500 mAh బ్యాటరీ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ గొప్ప అల్యుమినియం ఫ్రేమ్ మరియు ప్రీమియం ఫ్యాబ్రిక్ మెటీరియల్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP48 వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ moto ai సపోర్ట్ కలిగి గొప్ప ai సౌకర్యాలు కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile