మోటో వన్ మ్యాక్రో vs రెడ్మి 8 : స్పెక్స్ కంపారిజన్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 09 Oct 2019
మోటో వన్ మ్యాక్రో vs రెడ్మి 8 : స్పెక్స్ కంపారిజన్
HIGHLIGHTS

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల స్పెషిఫికేషన్లను సరిపోల్చి చూద్దాం.

Advertisements

VIVO V19: HELPING YOU TAKE THE PERFECT SHOT FOR THOSE PERFECT MOMENTS

Let’s take a better look at what the new vivo V19 has to offer.

Click here to know more

ఈరోజు ఈరెండు కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చెయ్యబడ్డాయి. షావోమి తన 8 సిరీస్ నుండి రెడ్మి 8 స్మార్ట్ ఫోన్ను తీసుకురాగా, మోటరోలా తన వన్ సిరీస్ నుండి వన్ మ్యాక్రో స్మార్ట్ ఫోన్ను విడుదలచేసింది. ఈ రేడు స్మార్ట్ ఫోన్లు కూడా కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో, బడ్జెట్ వినియోగధారులను ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఒక మంచి ఎంపికగా ఉంటుందో తెలుసుకోవడానికి,ఈ రెండు స్మార్ట్ ఫోన్ల స్పెషిఫికేషన్లను సరిపోల్చి చూద్దాం.

ధర

షావోమి రెడ్మి రెండు వేరియంట్లలో విడుదలయింది. అయితే, సంస్థ ఈ ఫోను పైన ప్రకటించిన అఫర్ కరంగా రెండు వేరియంట్లు కూడా ఒకే ధరతో లభిస్తాయి. 3GB+32GB/4GB+64GB వేరియంట్లు ప్రస్తుతం కేవలం రూ.7,999 ధరకే లభిస్తాయి. ఇక వన్ మ్యాక్రో మాత్రం కేవలం 4GB +64GB ఒకే ఒక్క వేరియంట్ తో లాంచ్ అయ్యింది. ఇది రూ.9,999 ధరతో విడుదల చెయ్యబడింది.                 

డిజైన్

డిజైన్ పరంగా, రెడ్మి 8 ఫోన్  బాగుంటుందని చెప్పొచ్చు. ఇది Aura Mirror డిజైనుతో చూడగానే ఆకట్టుకుంటుంది మరియు నాలుగు విలక్షణమైన కలర్ ఎంపికలతో వస్తుంది. అయితే, మోటరోలా వన్ మ్యాక్రో మాత్రం కేవలం ఎప్పటిలాగే తన ముందు ఫోన్లను ఇచ్చిన డిజైన్నే దీనికి కూడా ఇచ్చింది మరియు ఇది కేవలం ఒకేఒక్క స్పెస్ బ్లూ కలర్ తో మాత్రమే వస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా స్ప్లాష్ ప్రూఫ్ తో వస్తాయి.                  

డిస్ప్లే 

షావోమి నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ రెడ్మి 8 ఫోన్ ఒక 6.22 అంగుళాల HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది 270 PPI, 1520x720 రిజల్యూషన్ మరియు డాట్ నోచ్ డిజైనుతో వస్తుంది. షావోమి సంస్థ, ఈ డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో అందించింది. ఇక మోటో వన్ మ్యాక్రో విషయానికి వస్తే, ఈ ఫోన్ ఒక 6.2 అంగుళాల HD+ డిస్ప్లేని మ్యాక్స్ విజన్ తో అందించింది మరియు 19:9 యాస్పెక్ట్ రేషియాతో వస్తుంది. డిస్ప్లే పరంగా ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 720 పిక్సెళ్ళ రిజల్యూషనుతో వస్తాయి.

ప్రాసెసర్

రెడ్మి 8 ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. ఈ ప్రాసెసర్, 3GB మరియు 4GB LPDDR3 ర్యామ్ తో జతగా వస్తాయి. ఇక స్టోరేజి విహాస్యానికి వస్తే, ఇది 32GB,  64GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది మరియు ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డుతో 512 GB వరకూ స్టోరేజిని పెంచుకోవచ్చు. మోటో వన్ మ్యాక్రో విషయానికి వస్తే, ఈ ఫోన్ ఒక మీడియా టెక్ హీలియో P70 ఆక్టా కోర్ ప్రాసెసరుకి జతగా 4GB LPDDR4 ర్యామ్ తో మరియు 64GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డుతో 512 GB వరకూ స్టోరేజిని పెంచుకోవచ్చు. ప్రాసెసర్ మరియు ర్యామ్ పరంగా చూస్తే, మోటో వన్ మ్యాక్రో ఫోను కొంచెం బాగుంటుందని చెప్పొచ్చు.

కెమేరా

కెమేరా విభాగంలో, మోటరోలా వన్ మ్యాక్రో ఫోనుదే పైచేయ్యని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ఫోను వెనుక భాగంలో 13MP +2MP +2MP(మ్యాక్రో) కెమేరా సెటప్ కలిగి ఉంటుంది. అయితే, రెడ్మి 8 మాత్రం 12MP +2MP డ్యూయల్ కెమేరాని కలిగి ఉంటుంది. అలాగే, సెల్ఫీ విషయానికి వస్తే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 8MP సెల్ఫీ కెమేరాతో వస్తాయి. కానీ, ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ధరలలో కూడా గమనించదగిన వ్యత్యాసాలు ఉన్నాయని గమనించాలి.

బ్యాటరీ మరియు ఇతర ఫీచర్లు

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా పెద్ద బ్యాటరీలతో వచ్చాయి. అయితే, రెడ్మి 8 స్మార్ట్ ఫోన్ మాత్రం ఇక్కడ పూర్తిగా ఆధిక్యాన్ని సాధించింది.ఈ ఫోన్ ఒక పెద్ద 5,000 mAh బ్యాటరీతో మరియు 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తే, మోటో వన్ మ్యాక్రో మాత్రం 4,000 mAh బ్యాటరీతో మరియు 10W ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. అయితే, వాస్తవానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా బాక్సుతో లో ఒక 10W చార్జరుతో మాత్రమే వస్తాయి. 

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

In light of the government guidelines regarding e-commerce activities, we have currently disabled our links to all e-commerce websites

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status