MOTOROLA నుండి మొదటి పాప్ – అప్ మరియు 64MP స్మార్ట్ ఫోన్

MOTOROLA నుండి మొదటి పాప్ – అప్ మరియు 64MP స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

మోటరోలా వన్ హైపర్ 64 MP వెనుక కెమెరాను కలిగి ఉంది.

 మోటరోలా యొక్క మొట్టమొదటి పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఫోన్, మోటరోలా వన్ హైపర్ త్వరలోనే విడుదల చేయవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోనుకు థాయ్‌లాండ్‌లోని NTBC  సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి, మోటరోలా మరో వన్-సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌ ను విడుదల చేయనున్నట్లు అధికారిక ధృవీకరణ లేదు, అయితే ఈ డివైజ్ ముందస్తు నివేదికలలో లీక్ అయింది. తయారీదారులు పాప్-అప్ కెమెరా డిజైన్‌ ను తమ మధ్య-శ్రేణి ఫోనులకు తీసుకువచ్చినప్పటికీ, మోటరోలా దీన్ని ఇంకా తన ఫోన్లలో ఇంతవరకూ ప్రవేశపెట్టలేదు.

మునుపటి లీక్‌ల ప్రకారం, మోటరోలా స్మార్ట్‌ ఫోనులో ఫుల్ – స్క్రీన్ తరహాలో తమ టేక్‌ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇది బడ్జెట్ ఫోను కూడా కావచ్చని భావిస్తున్నారు. ఈ మోటరోలా వన్ హైపర్ 19.4: 9 యొక్క యాస్పెక్ట్ రేషియోతో ఒక 6.4-అంగుళాల 1080p ప్యానెల్ కలిగి ఉండవచ్చు. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 చిప్‌ సెట్ యొక్క శక్తితో రావచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్, 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, మోటరోలా వన్ హైపర్ 64 MP వెనుక కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతానికి, షావోమి, రియల్మి మరియు శామ్‌సంగ్ నుండి మాత్రమే ఒక 64 MP కెమెరా స్మార్ట్‌ ఫోన్లను చూశాము. ఈ స్మార్ట్ఫోన్ యొక్క హైలైట్ విషయానికి వస్తే, పాప్-అప్ మాడ్యూల్ 32MP సెల్ఫీ కెమెరా మాడ్యూల్ను కలిగి ఉంటుంది. అందువల్ల, దీని డిస్ప్లేలో ఎటువంటి నోచ్ వుండదు. వెనుక ప్యానెల్‌లోని మోటరోలా లోగో చుట్టూ మెరుస్తున్న రింగ్‌ను కూడా లీకైన చిత్రాలు చూపిస్తున్నాయి. ఇది ముందు వుండే నోటిఫికేషన్ లైట్ ని కోల్పోకుండా, వెనుక వైపున భర్తీ చేస్తుంది.

మోటరోలా వన్ హైపర్ ఆండ్రాయిడ్ 10 తో పాటుగా తీసుకురావడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మోటరోలా వన్-సిరీస్ స్మార్ట్‌ ఫోన్లకు చెందినది కావచ్చు, ఇది ఇటీవల ప్రారంభించిన మోటరోలా వన్ మాక్రో మాదిరిగానే ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌ లో భాగం కాకపోవచ్చు.

ఇంకా, మోటరోలా వన్ హైపర్ 3600 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. వన్ హైపర్ యొక్క ప్రారంభ తేదీ మరియు ధరపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అయితే, మోటరోలా మాత్రం నవంబర్ 13 న లాస్ ఏంజిల్స్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది, ఇక్కడ మడతపెట్టే రేజర్ ఫోన్‌ ను ఆవిష్కరించవచ్చని  భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo