మోటోరోలా వన్ యాక్షన్ కెమేరా నిజంగా ఒక అద్భుతం
మోటరోలా ఒక ప్రత్యేకకార్యక్రమం ద్వారా తన ఒక అల్ట్రా వైడ్ యాక్షన్ కెమేరాతో ట్రిపుల్ రియర్ కెమేరా ఫోన్ అయినటువంటి మోటోరోలా యాక్షన్ వన్ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, చూడడానికి మోటో వన్ విజన్ మాదిరిగా కనిపిస్తుంది కానీ వెనుక మూడు కెమేరాలతో కేవలం రూ. 13,999 ధరతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగష్టు 30 వ తేదీకి మొదటి ఫ్లాష్ సేల్ జరగనుంది.
Surveyవన్ యాక్షన్ కెమేరా ప్రత్యేకతలు
ఈ ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోనులో వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ఒక f /1.8 అపర్చరు కలిగిన 12 MP ప్రధాన కెమెరా మరియు 5MP డెప్త్ కెమెరాతో పాటుగా f/2.2 అపర్చరు గల ఒక 16MP అల్ట్రా వైడ్ యాక్షన్ కెమేరా కూడా ఉంటుంది. ఇక సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం f/2.0 అపర్చరుతో ఒక 12MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఇవన్నీ కూడా మనకు సాధారంగా తెలిసినవే. అయితే ఈ కెమేరా గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విష్యం ఏమిటంటే, మనం సాధారంగా వీడియోలను నిలువుగా తీసినట్లయితే చూసేప్పుడు కూడా అలాగే చూడల్సివస్తుంది. కానీ, ఈ స్మార్ట్ ఫోనులో అందించిన కెమేరాతో వీడియోలను నిలువుగా లేదా అడ్డంగా తీసినా కూడా అది మనకు పూర్తి స్క్రీన్ పైన చేసుకునేలా అందిస్తుంది. ఈ అవకాశం కలిగిన ఏకైన ఫోన్ ఈ మోటో వన్ యాక్షన్ స్మార్ట్ ఫోన్.
ఇందులో అందించిన 117 డిగ్రీల 16MP యాక్షన్ కెమేరా మీరు తీసే వీడియోలకు ప్రాణం పోస్తుంది. వీడియోలు చాల స్పష్టంగా మరియు మంచి వివరాలతో అందిస్తుంది. అధనంగా, వెలుగు తక్కువగా వున్నా సమయాల్లో కూడా ఈ ఫోన్ మంచి విడిలను తీసుకునేలా ఉంటుంది. అలాగే, ఇందులో అందించిన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) వీడియోలకు మరింత సామర్ధ్యాన్ని అందిస్తుంది.