ఆండ్రాయిడ్ 11 తో రేపు విడుదలకు సిద్ధం అవుతున్న మోటో G30 మరియు G10 పవర్

ఆండ్రాయిడ్ 11 తో రేపు విడుదలకు సిద్ధం అవుతున్న మోటో G30 మరియు G10 పవర్
HIGHLIGHTS

ఈ ఫోన్లు స్టాక్ ఆండ్రాయిడ్ 11 తో రేపు విడుదలకు సిద్ధం

మోటో G30 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్

మోటో G10 మాత్రం ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్

గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మోటో G30 మరియు G10 పవర్ స్మార్ట్ ఫోన్లు రేపు ఇండియాలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్లు పెద్ద బ్యాటరీ, మల్టి కెమెరాలు మరియు హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తో సహా ట్రెండీ ఫీచర్లతో ఉంటాయి. ఈ ఫోన్లు స్టాక్ ఆండ్రాయిడ్ 11 తో రేపు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

ఈ రెండు మోటో ఫోన్లలో మోటో G30 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా మరియు మోటో G10 మాత్రం ఎంట్రీ లెవెల్ ఫోనుగా మార్కెట్లోకి వచ్చే అవకాశం వుంది. అలాగే, వీటి రేటుకు తగ్గట్టుగానే మోటో G30 స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ మరియు 6GB ర్యామ్ తో వస్తుంది. అయితే, మోటో G10 మాత్రం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్ తో వస్తుందని భావిస్తున్నారు. అలాగే, మోటో G30 64 MP క్వాడ్ కెమెరా సెటప్ తో ఉండగా, మోటో G10 మాత్రం 48MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది.

ఈ ఫోన్స్ బ్యాటరీ మరియు ఛార్జింగ్ సపోర్ట్ విషయానికి వస్తే, మోటో G30 లో 5,000 mAh మరియు మోటో G10 మాత్రం 6,000 mAh బ్యాటరీ తో వస్తుంది. ఈ రెండు మోటో ఫోన్లు 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని అందించింది. అలాగే, ఈ మోటో G30 మరియు G10 అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 తో వస్తాయి.       

  ఈ ఫోన్ల లాంచ్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo